కొత్త రేషన్ కార్డుదారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీపి కబురు చెప్పారు. ఆగస్టు నెల నుండి కొత్త రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా 10 కిలోల ఉచిత బియ్యం పంపిణి చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నవంబర్ వరకూ ఈ 10 కిలోల ఉచిత బియ్యం పంపిణి ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి 53.56 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో 5 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేయనుంది.
ఇక మిగతా 37 లక్షల తెలంగాణ రాష్ట్ర కార్డులకు పూర్తిగా 10 కిలోలు ఉచితంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. నెలకు కొత్త కార్డులకు 23.10 కోట్లతో కలిపి ఏడు నెలల కాలానికి అదనంగా 416.34 కోట్లు వెచ్చించనుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త కార్డులకు కేటాయింపులు, ఆదనపు బియ్యం సేకరణ నేపథ్యంలో ఆగస్టు 3 నుండి ఈ పంపిణీ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.