నిద్ర.. ప్రతి మనిషికీ ఎంతో అవసరమైనది. కంటినిండా నిద్ర లేకపోతే ఆ వ్యక్తికి ఆ రోజంతా నరకమే అని చెప్పుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరికి నిద్ర సరిపోవడం లేదు. కంటి నిండా నిద్రపోతే.. శరీరం అలసట నుంచి దూరం అవుతుందని, శరీర పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి నిద్ర అనేది చాలా స్పెషల్. రోజూ నిద్రలోనే ఉండే వాళ్లు కూడా ఉన్నారు. రోజంతా అలసిపోయి.. రాత్రిపూట గోరు వెచ్చటినీటితో స్నానం చేసి పడుకునే వాళ్లు ఉన్నారు. రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు శరీరం ప్రశాంతతను కోరుకుంటుంది. అయితే నిద్రపోయేటప్పుడు చాలా మంది డిఫరెంట్ పొజిషన్స్‌లో నిద్రపోతారు. కొందరు నిటారుగా పడుకుంటే.. మరికొందరకు బొక్కబొర్లా పడుకుంటారు. ఇంకొందరు రెండు చేతులు వెనకాల చాచుకుని పడుకుంటారు. ముడుచుకుని పడుకుంటారు. అలా చాలా పొజిషన్స్‌లో ప్రజలు పడుకుంటారు. అయితే ఇలాంటి పొజిషన్స్‌లో పడుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని తెలపవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిద్రపోయే పొజిషన్స్ గురించి తెలుసుకుందాం రండి.
ముడుచుకుని పడుకోవడం..
చాలా మందికి ముడుచుకుని పడుకోవడం అలవాటు. కడుపులో బిడ్డ ఎలా తన కాళ్లు, చేతులను ముడుచుకుని పడుకుంటాడో.. అలా ఈ పొజిషన్‌లో పడుకుంటారు. నిజానికి ఇలా పడుకునే వారికి భయం ఎక్కువ. అందుకే ముడుచుకుని పడుకుంటారు. ఇలా నిద్రపోతే వాళ్లకు తల్లిగర్భంలో పడుకునే వెచ్చని అనుభూతి కలుగుతుందట. వీరికి కోపం ఎక్కువగా ఉంటుందట. ఈ పొజిషన్‌లో నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి, కండారాల్లో నొప్పి రావడం జరుగుతుంట. అందుకే ఈ పొజిషన్‌లో నిద్రపోయేవాళ్లు.. ఈ అలవాటును మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
బోర్లా పడుకోవడం..
సాధారణంగా చాలా మందికి బొక్క బొర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఈ పొజిషన్‌లో పడుకునే వారు తమ కాళ్లు, చేతులను సాగదీసి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల ఎంతో మధుర అనుభూతిని పొందుతారు. అచ్చం సీతాకోక చిలుక ఎగురుతున్నట్లుగా ఫీల్ అయి ప్రశాంతంగా నిద్రపోతారు. ఇలా పడుకునే మనస్థత్వం ఉన్న వారు అందరినీ ఎక్కువగా నమ్ముతారంట.
చేతులు తల కింద పెట్టుకుని..
రిజర్వ్‌గా ఉంటూ.. ఎప్పుడు నిశబ్దంగా ఉంటే వ్యక్తులు ఈ పొజిషన్‌లో పడుకునేందుకు ఇష్టపడతారు. వీరికి స్నేహితులు, సన్నిహితులు తక్కువగా ఉంటారు. వీరు చాలా భిన్నంగా ఉంటూ.. విలాసవంతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. నేలపై పడుకుని నక్షత్రాలను చూస్తూ తలకింద చేతులు వేసుకుని పడుకుంటారు. ఈ స్థితిలో నిద్రించడానికి ఇష్టపడే వ్యక్తులు ఉల్లాసంగా, సంతోషంగా, బాధ్యతాయుతంగా ఉంటారు.
దిండుని హగ్ చేసుకుని..
దిండుని హగ్ చేసుకుని పడుకునే వారి స్వభావం ఎంతో ప్రియమైనది. ఈ స్థితిలో నిద్రించేవారికి సంబంధాలపై గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎవరినీ ఎక్కువగా హర్ట్ చేయరు. స్నేహితులు, కుంటుంబం వ్యక్తిగత బంధాలను ఎంతో ఆదరిస్తారు. ఇష్టం ఎక్కువగా ఉన్న వ్యక్తులు తమకు నచ్చిన వారిని దిండుగా ఊహించుకుని హగ్ చేసుకుని పడుకుంటారు. వ్యక్తిగత బంధాలను ఆదరించడంతోపాటు ఎవరికీ హాని కలిగించకుండా ఉండటమే వీరి స్వభావం.