పొగ తాగేవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి!

Join Our Community
follow manalokam on social media

పొగ తాగేవారు అధిక ప్రీమియం చెల్లించాలి. పొగ తాగే అలవాటు ఉన్న వ్యక్తులు పాలసీ తీసుకోబోయే ముందు దీని గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరముంది. పాలసీదారుడి ఉద్యోగ ప్రొఫైల్‌ను పరిగణలోకి తీసుకుని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం లెక్కిస్తారు. రిస్క్‌ ఎక్కువ ఉన్న జాబ్‌ ప్రొఫ్‌ల్‌ ఉన్నవారు పాలసీ తీసుకోవాలనుకుంటే జీవిత బీమా ప్రీమియం చాలా ఎక్కువగా ఉంది.

అదేవిధంగా బ్యాంక్‌లలో పనిచేసేవారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వంటి తక్కువ రిస్క్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఉన్నవారికి తక్కువ ప్రీమియం చెల్లిస్తారు. సంబంధిత ప్రీమియాన్ని అంచనా వేయడానికి ప్రతి పరిశ్రమను పొగతాగేవారు, తాగనివారి జాబితాను విభజించారు. దీనివల్ల తక్కువ రిస్క్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఉన్నవారి కంటే ఎక్కువ రిస్క్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాలని డేటా వెల్లడించింది. పొగ తాగటం వల్ల అత్యధిక రిస్క్‌ ఉన్నవారు మరణానికి దారితీసే అవకాశం ఎక్కువ ఉండటంతోపాటు, పొగ తాగటం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో వారు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు ప్రధానం

జీవిత బీమా ప్రీమియం టర్మ్‌ కవర్‌ అందించేటపుడు హామీని నిర్ణయిస్తాయి. అంటే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంటే ప్రీమియం చెల్లింపు అధికంగా ఉంటుంది. మరణాల ప్రమాదం తక్కువగా ఉంటే ప్రీమియం చెల్లింపు తక్కువగా ఉంటుంది. పొగతాగటం వల్ల ఆరోగ్యానికి హానీ కలిగించి, వ్యాధులను పెంచుతుంది. అప్పుడప్పుడు పొగ తాగినా.. బీమా పరిభాషలో పొగ తాగేవారిగానే పరిగణించబడతారు. వీరు కూడా అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొగ తాగేవారు క్లెయిమ్‌లు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీమా సంస్థలు పాలసీదారుల నుంచి అధిక ఛార్జీలతో అదనపు రిస్క్‌ కవరేజీని అందిస్తారు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...