రైతులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ అకౌంట్లలోకి డబ్బులు!

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్‌ యోజన డబ్బులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద 8వ విడత డబ్బులను రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్ధం అవుతోంది.


మోడీ ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. పీఎం కిసాన్‌ పథకం కింద మరో విడత డబ్బులు అందించేందుకు సిదమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ స్కీమ్‌ కింద నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7 విడత డబ్బులను రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు అందించేందుకు సన్నద్ధమవుతోంది. మార్చి నెల చివరి నాటికి రైతులకు ఈ డబ్బులు అందే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు డబ్బులని అందిస్తోంది. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు రైతులకు అందుతున్నాయి. ఇప్పుడు 8వ విడత డబ్బులు రానున్నాయి.

ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11.27 కోట్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. మీరు ఇప్పటికీ కూడా ఈ స్కీమ్‌లో చేరకపోతే ఇప్పుడైనా చేరే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే చేరి ఉండి కూడా డబ్బులు రాకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో మీ అప్లికేషన్‌ స్టేటస్‌ ఏంటో తెలుసుకోవాలి. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో మీ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.

మీరు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత ఫార్మర్స్‌ కార్నర్‌ అని ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయాలి. తర్వాత బెనిఫీషియరి స్టేటస్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీ ఆధార్‌ నెంబర్‌ లేదా మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇప్పుడు మీ స్టేటస్‌ వివరాలు తెలుస్తాయి. వెంటనే ఈ పథకంలో మీరు చేరీ, కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న డబ్బులతో లబ్ధి పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news