అక్కడ 5 రోజులు నగ్నంగా ఉండి మహిళలు పూజలు..ఈ ఆచారంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు

-

మనదేశంలో దైవభక్తి ఎక్కువే..అలాగే మహిళలను కూడా దేవుళ్లతో సమానంగా చూసే భావనా ఎక్కువే. అందుకే అంటుంటారు… ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో..అక్కడ దేవతలు తిరిగుతుంటారు అని. అలాంటిది అక్కడ వింత ఆచారం పేరిట..మహిళలను నగ్నంగా అయిదు రోజులు ఉంచుతున్నారు. వీళ్లు ఇలా ఎందుకు ఉంటారు, ఇదేం ఆచారమో అనిపిస్తుంది కదా.. ఈ వింత ఆచారం గురించి ఇప్పుడు చూద్దాం.

rituvals in himachal pradesh in pine

హిమాచల్ ప్రదేశ్‌లోని పిని అనే చిన్న గ్రామం. గ్రామం చిన్నదే అయినా గుర్తింపు దేశవ్యాప్తంగా ఉంది.. కారణం.. ఈ వింత ఆచారమే. చాలా మంది ఇలాంటి ఆచారం ఒకటుంది అంటే నమ్మలేరు. కట్టుకథ అనుకుంటారు. కానీ దీన్ని నిజంగానే అక్కడి మహిళలు ఇష్టపూర్వకంగానే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎవరి బలవంత లేకుండా వారంతట వారే ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు. ఎంతో నియమ నిష్టలతో ఈ నగ్న దీక్ష పాటిస్తున్నారు.

himachal-pradesh

ఈ గ్రామంలో మొత్తం జనాభా 2,593 మంది. ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకొని షాక్ అవుతుంటారు… అక్కడి వారు చెప్పే కథేంటంటే.. పూర్వం ఇక్కడ లాహు ఘోండ్ దేవత ఉండేదట. ఆమె రాక్షసుల్ని చంపి… ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజులపాటూ ఈ నగ్న దీక్షను చేపడుతున్నారు మహిళలు

ఐదు రోజుల దీక్షలో భాగంగా మహిళలు తాము రోజూ కట్టుకునే బట్టలేవీ కట్టుకోరు. పూర్తిగా నగ్నంగా ఉంటారు. అంతేకాదు. ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లోని భర్త, భార్య ఎవరూ నవ్వకూడదు. అలా నవ్వితే దేవతకు ఆగ్రహం వస్తుందని వారి నమ్మకం. అందువల్ల నవ్వకుండా జాగ్రత్త పడతారు. ఏటా భాద్రబ్ నెలలో ఐదు రోజులు వేడుకలు జరుపుతారు. వేడుకల మొదటి రోజునే దేవత రాక్షసుల్ని చంపేసిందట. అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో మగవారు మద్యం తాగరు. ఆ గ్రామం వైపు బయటివారు ఎవరూ రారు. రానివ్వరు.

సరే పూజ చేస్తే చేయండి..మరి ఈ నగ్నం కాన్సప్ట్ ఏంటి అనే కదా మీ డౌట్..అందుకు రెండు కారణాలు ఉన్నాయట. పూర్వం రాక్షసులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారు. వారిని సంహరించడం ద్వారా ఆ దేవత మహిళల మానాన్ని కాపాడటంతో ఆమెకు ఆ విధంగా తమ భక్తిని చాటుకుంటున్నారు అక్కడి మహిళలు. మరో కారణం ఏంటంటే.. పిని గ్రామం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలే ఉంటుంది. ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది. అలాంటి చోట బట్టలు లేకుండా నిమిషం ఉండటమే కష్టం. అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండటం అనేది కఠినమైన దీక్ష. అలాంటి దీక్షతోనే అమ్మవారి అనుగ్రహం పొందగలం అని స్థానికులు భావిస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news