తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హరీష్ రావు కు వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్య మంత్రి కేసీఆర్ కేటాయించాడు. ఇప్పటి వరకు ఈ శాఖ ముఖ్య మంత్రి కేసీఆర్ వద్ద నే ఉండేది. అయితే దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ కు మంత్రి గా వ్యవహరించే వాడు.
అయితే ఈటల రాజేందర్ భూమిని అక్రమంగా ఆక్రమించాడు అని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఈటల మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఖాళీ గా ఉండేది. ముఖ్య మంత్రి కేసీఆర్ స్వయంగా కొన్ని రోజుల పాటు ఈ శాఖ ను పరిశీలించాడు. అయితే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు అధనపు బాధ్యత గా వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్య మంత్రి కేటాయించారు.