టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరుద్యోగులు, విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. కరోనా కారణంగా అనేక మంది ఇండ్లకే పరిమితమైన నేపథ్యంలో.. ఓ డిజిటల్ సర్టిఫికెట్ కోర్సును ఉచితంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. 15 రోజుల వ్యవధి గల ఈ కోర్సును ఎవరైనా పూర్తి చేయవచ్చు. ఇక కోర్సుకు గాను ఎలాంటి ఫీజును వసూలు చేయడం లేదని టీసీఎస్ తెలిపింది.
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సును నేర్చుకోవచ్చు. కెరీర్ ఎడ్జ్ డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌గా పిలవబడుతున్న ఈ కోర్సు వల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకోవచ్చని టీసీఎస్ తెలిపింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా తమ కెరీర్‌లో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు ఈ కోర్సు సహాయంతో మరిన్ని కెరీర్ అవకాశాలను పొందవచ్చు.
ఇక ఈ కోర్సును ఎవరైనా.. ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీలోనూ ఈ కోర్సును పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు గాను ఎలాంటి చార్జిని వసూలు చేయడం లేదు. అంతా ఉచితమే. కోర్సులో భాగంగా అభ్యర్థులకు వీడియోలు, కేస్ స్టడీస్, అసెస్‌మెంట్స్ ఇవ్వబడతాయి. దీంతో తమ నైపుణ్యాలకు వారు మరింత పదును పెట్టుకోవచ్చు. కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లవచ్చు..!