శుభ‌ప‌రిణామం : టెర్ర‌స్ గార్డ‌న్స్‌కి పెరుగుతున్న ఆదర‌ణ‌

-

ఇటీవల కాలం లో తినే ఆహారం పై శ్రద్ధ పెరిగింది. బయట అమ్ముతున్న వాటిల్లో అత్యధికంగా రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వీటి కారణంగా అనేక వ్యాధులు సంభవిస్తున్నట్టు అవగాహన అందరిలోనూ కలుగుతుంది. అయితే దీని కారణంగా ప్రతీ ఒక్కరు తన ఇంట్లోనే సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలను, ఆకుకూరలను పండించుకుంటున్నారు. ఇలా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పండించుకోవడం నేటి కాలం లో చాల శాతం పెరిగింది.

terrace garden
terrace garden

ఇది ఇలా ఉండగా పట్టణాల్లో ఎక్కువగా మొక్కలను పెంచుకోవడానికి స్థలం ఉండకపోవడంతో టెర్రస్‌, బాల్కనీ లో వాళ్ళకి నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను పండించుకుంటున్నారు. నిజంగా ఇళ్లల్లో పండినవి తినడం వాళ్ళ ఆరోగ్యం తో పాటు ఆనందంగా ఉంటుంది. గార్డెన్ లో పెంచే మొక్కలను రసాయనాలకు దూరంగా ఉంచుతూ.. సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. అలానే ఈ గార్డెనింగ్ లో సాగు కోసం అవసమైన ట్రేలు, గ్రో బ్యాగ్స్‌, విత్తనాలు, ఎరువులు, మట్టి, వర్మి కంపోస్టును వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అందిస్తున్నాయి.

కనుక మీరు వాటిని ఉపయోగించొచ్చు. అలానే మొక్కలకి తెగుళ్లు, చీడ పీడలు దరి చేరకుండా వేప నూనె, పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి. అలా చేస్తే సమస్యలు దరి చేరవు. మట్టిని సారవంతం చేసేందుకు ఆవు పేడ, గో మూత్రం, బెల్లంతో తయారు చేసిన జీవామృతాన్ని అందిస్తే మంచిది. మీరు ఇంట్లో వాడేసిన వస్తువుల్లో కూడా మొక్కల్ని నాటేయొచ్చు. పెద్దగా ఖర్చు కూడా మీకు అవ్వదు. పాత వాటర్ బాటిల్స్, టబ్బులు వగైరా వాటిల్లో కూడా మొక్కలని నాటేయొచ్చు. ఏది ఏమైనా సొంతంగా పండించుకుని తింటే ఆ ఆనందమే వేరు.

Read more RELATED
Recommended to you

Latest news