ఏపీలో కోడి పందాలు మీద హైకోర్ట్ కీలక ఆదేశాలు

-

ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ కోడి పందాలు జరగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని సూచనలు చేసింది. నిజానికి సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాలలో కోడిపందాలు విరివిగా జరుగుతూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందేల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నిర్వాహకులు. రాజకీయ నేతలు సైతం ఈ మూడు రోజులు కోడి పందాల బరి లోనే ఉంటారు అనడంలో సందేహం లేదు. కోడిపందాలు తమ సంప్రదాయం అని ఇప్పటికీ నేతలు చెబుతూనే ఉంటారు. ప్రతి ఏడాది కోడి పందాలను నిర్వహించకుండా చూడటానికి పోలీసులు ఎంత కష్టపడినా రాజకీయ నేతల ఒత్తిళ్లకు తగ్గి సైలెంట్ అవుతుంటారు. చూడాలి మరి ఏమవుతుందో ?

Read more RELATED
Recommended to you

Latest news