గ్రహాంతర జీవి అనుకున్నారు.. కానీ దగ్గరకు వెళ్లాక తెలిసింది..!

-

ఒక ఆటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి వింత జీవిని చూశాడు. గ్రహాంతర జీవేమో అని అనుమానంతో భయం భయంగా దగ్గరకు వెళ్లాడు. ఒళ్లాంత బొచ్చుతో కప్పబడి భయంకరంగా ఉన్న జీవి ఏమై ఉంటదా అని దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పుడు తెలిసింది అతనికి అది అడవి గొర్రె అని. దాని ఉన్ని బరువు మోయలేక తల్లడిల్లటం చూసి ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీకి అతను సమాచారం అందించాడు. వారి దగ్గర నుంచి ఆ గొర్రెను సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియా, లాన్స్‌ఫీల్డ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

అడవి గొర్రె
అడవి గొర్రె

మట్టి, ముళ్లు, ఇతర వస్తువులు అంటుకొని అంధ విహీనంగా ఉన్న ఉన్నిని ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ సభ్యులు కత్తిరించారు. కత్తిరించిన ఉన్నిని తూకం వేస్తే 35 కిలోలుగా తేలింది. దాదాపు ఒక కంగారు బరువుకు సమానం. అంత ఉన్నిని చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకాలం అంత ఉన్నిని మోస్తూ ఆ గొర్రె ఎలా బతికిందో అని అనుకున్నారు. మొత్తాన్ని ఉన్ని నీట్‌గా కట్ చేసి.. గొర్రెను శుభ్రంగా స్నానం చేయించారు. అప్పటి వరకు లావుగా, అంధవిహీనంగా ఉన్న ఆ అడవి గొర్రె.. ఇప్పుడు అందంగా మారిపోయింది. తెల్లగా మెరిసిపోతోంది. దానికి బారక్ అని పేరుపెట్టారు. అడవి గొర్రెకు ఉన్ని కత్తిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గొర్రె ఒంటి మీద ఉన్ని పెరగటం సాధరణం. దాన్ని ఏడాదికి ఒకసారి కత్తిరిస్తుంటారు. లేకపోతే ఉన్ని పెరిగిపోతూనే ఉంటుంది. దాదాపు ఐదేళ్లు ఉన్ని కత్తిరించకుండా ఉండటంతో ఆ అడవి గొర్రెకు ఏకంగా 35.4 కిలోల ఉన్ని పెరిగింది. 2015లో ఇలాగే ఓ అడవి గొర్రెకు ఏకంగా 42 కిలోల ఉన్నిని కత్తిరించారని గుర్తు చేసుకున్నారు అధికారులు. ఉన్నిని ఎప్పటికప్పుడు కత్తిరిస్తే గొర్రెలు బరువు పెరడగంతోపాటు.. ఆరోగ్యంగా ఉంటాయని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news