రైల్వేస్టేషన్‌లు అంటే.. ఎప్పడూ డౌన్‌లోనే ఉంటాయి. అంత లగేజ్‌తో ఉన్న కొద్ది మెట్లు ఎక్కడానికే మన పని అయిపోతుంది. ప్రపంచంలో అతి పెద్ద రైల్వేస్టేషన్, చిన్న స్టేషన్‌కు గురించి తెలుసు.. కానీ ఎత్తైన రైల్వేస్టేషన్ గురించి మీరు విన్నారా..? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే లైన్, ఎత్తైన రైల్వేస్టేషన్ ఈ రెండూ టిబెట్‌లో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
టిబెట్‌లోని తంగుల రైల్వేస్టేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేస్టేషన్. దీనిని దంగ్లా రైల్వేస్టేషన్ అని కూడా అంటారు. ఈ స్టేషన్ చింగై-టిబెట్ రైల్‌రోడ్‌లో ఉంది, ఇది టిబెట్‌ను మిగిలిన చైనాతో అనుసంధానించే మొదటి రైలుమార్గం. ఈ రైల్వేస్టేషన్‌లో సిబ్బంది ఉండరు. ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తుందట… క్రేజీ కదా..
ఈ రైల్వే స్టేషన్ 1 జూలై 2006న ప్రారంభమైంది. ఇది సముద్ర మట్టానికి 5,068 మీటర్లు అంటే 16,627 అడుగుల ఎత్తులో ఉందట… అయితే భారతదేశం.. కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై దీని కంటే ఎత్తైన రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తున్నారు. బొలీవియాలోని కాండోర్ రైల్వేస్టేషన్ ప్రపంచంలో రెండో ఎత్తైన రైల్వేస్టేషన్. అది సముద్ర మట్టానికి 4,786 మీటర్లు అంటే 15,705 అడుగుల ఎత్తులో ఉంది.
బొలీవియాలోని స్టేషన్.. అమ్డో కౌంటీ, కింగ్‌హై ప్రావిన్స్‌లో ఉంది. ఈ రైల్వేస్టేషన్‌లో 3 ట్రాక్‌లు ఉన్నాయి. ఒక దానికి ప్లాట్‌ఫారమ్ ఉంది. తంగుల రైల్వేస్టేషన్ పొడవు 1.25 కి.మీ. 2010 సంవత్సరానికి ముందు ఈ రైల్వేస్టేషన్‌కు ప్యాసింజర్ రైలు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరూ నివసించరు. ఇప్పుడు అక్కడకు ప్యాసింజర్ రైలు రావడం కూడా స్టాట్ అయింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం పొడవు 1,956 కిలోమీటర్లు. షిన్నింగ్ నుంచి గోల్ముడ్ వరకు 815 కి.మీ పొడవైన రైలు మార్గం నిర్మాణం 1984 నాటికి పూర్తయింది. లాసా వరకు మిగిలిన 1142 కి.మీ పొడవు సెక్షన్ నిర్మాణం 2006లో పూర్తయింది. ఈ రైలు 5,072 మీటర్ల ఎత్తులో ఉన్న తంగుల పాస్ గుండా వెళుతుంది.
ఈ రైలు మార్గంలో 1,338 మీటర్ల పొడవైన ఫెంఘూషన్ సొరంగం కూడా ఉంది. దీని ద్వారా ఈ రైలు వెళుతుంది. ఇది 4,905 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు సొరంగం. గోల్ముడ్ నుంతి లాసా రైలు మార్గంలో 45 స్టేషన్లు ఉన్నాయి. వాటిలో 38 మానవరహిత స్టేషన్లు, వాటిని షిన్నింగ్‌లో ఉన్న కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తారుట.. ఇది ఇంత ఎత్తైనా రైల్వేస్టేషన్‌గా పర్యాటకంగా బాగా ఫేమస్ అయింది.