మీరు పెట్టే సంతకం మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందట.. ఓసారి చూడండి!

ఏ వ్యక్తి వేలిముద్రలు ఒకేలా ఎలా అయితే ఉండవే.. సంతకాలు కూడా అలనే ఉండాలి. మనం పెట్టే సంతకాలకు చాలా విలువ ఉంటుంది. అయితే ఈ సైన్‌ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌.. కొందరు సింపుల్‌గా పేరు రాస్తే.. మరికొందరు ఎదుటివారికి అసలు ఏం అర్థంకాకుండా గీసేస్తారు. ఇంకొందరు ఒక లెటర్‌ మాత్రం రాస్తారు. అయితే న్యూమరాలజీ ప్రకారం చూస్తే.. మనం చేసే సంతకంపట్టి మన అదృష్టం ఉంటుందట. అంటే.. ఎలా చేయాలో తెలుసుకుని చేస్తే.. కాస్త మంచిదని న్యూమరాలజిస్ట్స్‌ చెప్తుంటారు. మీరు పెట్టే సంతకం మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుందని మీకు తెలుసా..? అవును.. ఇప్పుడు ఈ సంతకాల వెనుక స్టోరీ ఏంటో చూడండి..!

సంతకం క్రింద రెండు గీతలు గీసే వారు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ చాలా పిసినారులుగా ఉంటారట. ఈ వ్యక్తుల ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ వారు అభద్రతాభావంతో ఉంటారు.

కొందరు తమ సంతకం కింద పూర్తి గీత గీసి(ఒక పెద్ద గీత), దాని తర్వాత ఒకటి రెండు చుక్కలు వేస్తుంటారు. అలాంటి వారు డబ్బు సంపాదించడంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు డబ్బును బాగా ఆదా చేస్తారు.

ఒక వ్యక్తి సూటిగా.. సరళంగా సంతకం చేస్తే.. అటువంటి వ్యక్తి, ఆరోగ్యం, డబ్బు పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు.

ఒక వ్యక్తి చిన్న, వక్రీకృత పదాలలో సంతకం చేస్తే.. అతను చాలా తెలివైనవాడు. అటువంటి వ్యక్తులకు ఏ విధంగా డబ్బు సంపాదించాలో భాగా తెలుసు.. దాని కారణంగా వారు చాలాసార్లు అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఒక వ్యక్తి తన సంతకంలో తన పేరులోని మొదటి అక్షరాన్ని వ్రాసి.. అతని పేరు క్రింద ఒక చుక్కను వేస్తే.. అలాంటి వ్యక్తి ధనవంతుడు. ఆర్థికంగా బలంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది.

ఒక వ్యక్తి పై నుంచి క్రిందికి సంతకం చేస్తే.. అలాంటి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తి అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు అప్పులు తీసుకునే పరిస్థితికి దిగజారుతారు.

ఒక వ్యక్తి సంతకం చేసేటప్పుడు పెన్నుపై తక్కువ ఒత్తిడిని పెడితే.. అలాంటి వ్యక్తి కూడా డబ్బు సంపాదించడానికి తనను తాను మార్చుకుంటారు. ఈ వ్యక్తులు ఎక్కువగా ఒత్తిడికి కలిగి ఉంటారు.

ఒక వ్యక్తి దిగువ నుంచి పైకి సంతకం చేస్తే, అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు డబ్బు అవసరమైనప్పుడు.. వారు దానిని సులభంగా ఏర్పాటు చేసుకోగలరు.

ఒక వ్యక్తి సంతకంలోని మొదటి అక్షరాన్ని కొంచెం పెద్దగా, మిగిలిన అక్షరాలు చిన్నగా, అందంగా రాస్తే, అలాంటి వ్యక్తి క్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరి ఆరోగ్యం బాగా స్థిరంగా ఉంటుంది.

వ్యక్తి సంతకంలో మొదటి అక్షరం చాలా పెద్దదైతే, అలాంటి వ్యక్తి చాలా మంచి మనసు కలిగినవారై ఉంటారు. అలాంటి వారికి జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కలిసి వస్తుంటుంది. వారి శరీరం చాలా దృఢంగా.. ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక: సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది రాయడం జరిగింది. వీటికి నమ్మకాలే కానీ ఆధారాలు లేవు.