తప్పుడు వ్యక్తి ప్రేమలో మీరున్నారని చెప్పడానికి పనికొచ్చే సంకేతాలు

-

ప్రేమ గుడ్డిదంటారు. నిజమే.. లేదంటే ప్రేమ వివాహాలు ఎక్కువకాలం ఎందుకు నిలబడట్లేదు? అలా అని అందరి ప్రేమా గుడ్డిది అని చెప్పడం ఉద్దేశ్యం కాదు. కొందరి విషయంలో మాత్రం ప్రేమ గుడ్డిదన్న మాట నిజమే అవుతుంది. ప్రేమలో ఉన్నప్పుడూ అవతలి వ్యక్తిలోని ఎలాంటి బలహీనతా కనబడదు. గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుంది. మేఘాల మీద నాట్యం ఆడుతున్న అనుభూతి కలుగుతుంది. కానీ ఒక్కసారి ఆ మైకం పోయిందా.. ఇక అంతే. చటుక్కున నేల మీద పడేసరికి మనసుకు విపరీతమైన గాయాలు అవుతాయి. అవి మానడానికి ఒక్కోసారి జీవిత కాలం పట్టవచ్చు.

love
love

అందుకే ప్రేమలో అయినా మరెక్కడైనా జాగ్రత్త అవసరం. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి తప్పుగా ఉన్నాడని ముందే గుర్తించాలి. దానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. చాలామంది వాటిని విస్మరిస్తారు. మీరు పట్టుకోండి.

ప్రతీసారీ మీరే టైమ్ అడుగుతున్నారా?

మీరు ప్రేమించిన వారితో మాట్లాడదామని కాల్ చేస్తే బిజీ ఉన్నా, రేపు చేస్తా అని చేయకపోవడం చేస్తున్నారా? మాట్లాడడానికి టైమే ఇవ్వట్లేదని నిందలు వేస్తున్నారా? కాల్ చేసిన ప్రతీసారీ టైమ్ లేదని అంటున్నారా? ఐతే ఆలోచించాల్సిందే.

కమ్యూనికేషన్ గ్యాప్

అవతలి వారికి మీకూ మధ్య కమ్యూనికేషన్ పెద్దగా లేకపోవడం. చాలా సార్లు అవతలి వారి విషయాలు పెద్దగా తెలియకపోవడం. మీకు చెప్పకుండా దాచేయడం జరుగుతుంటే వారితో మీ ప్రేమ ఎక్కువ కాలం కొనసాగదని అర్థం చేసుకోండి.

మాట్లాడే సమయం వారికి నచ్చిందే కావడం

వారి మానసిక స్థితి బాగున్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడడం, కేవలం వారి ఆనందం కోసం మాత్రమే మీతో మాటలు కలపడం మొదలగునవి మీకనిపిస్తుంటే జాగ్రత్తగా ఉండండి.

మాటలకు చేష్టలకు పోలిక లేకపోవడం

ప్రేమలో మాటలు చాలా ముఖ్యం. మాట మీద నిలబడడం ఇంకా ముఖ్యం. అబద్ధాలు అన్ని సార్లు ఆనందాన్ని ఇవ్వలేవు. అవతలి వ్యక్తి మీ నుండి తప్పించుకోవడానికి అనవసరమైన అబద్ధాలు చెబుతున్నట్లయితే వారితో ప్రేమను ముందుకు తీసుకెళ్ళపోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news