ఏ బంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆడా మగ బంధాల్లో ఇది చాలా కీలకం. ఎందుకంటే మిగతా బంధాల్లో మనుషులు దూరమైనా పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. కానీ, ఆడా మగ బంధాల్లో అపనమ్మకాలు ఏర్పడి, మనుషులు దూరమయ్యే పరిస్థితి వస్తే అది ఎమోషనల్ గా చాలా ప్రభావం చూపుతుంది. మనసు మీద బాగా ప్రభావం పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఐతే ఈ అపనమ్మకం ఏర్పడినపుడు ఎవ్వరూ డైరెక్టుగా చెప్పలేరు.
మీ మీద అవతలి వారికి అపనమ్మకం ఏర్పడిందని మీకు అనిపించినపుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు అవతలి వారు మీతో ఉండడాన్ని ఇష్టపడట్లేదని తెలుపుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరేది చెప్పినా, దేని గురించి మాట్లాడినా మీతో కలవకుండా ఉండాలని చూస్తారు. ఎప్పుడూ బిజీగా ఉండాలని ప్రయత్నిస్తారు. దానివల్ల మీతో కలవకుండా ఉండాలని కోరుకుంటారు. అంత బిజీగా ఉంటున్నావెందుకు అనే ప్రశ్న మీరడిగితే కొత్త కొత్త కథలు చెబుతారు. కానీ సరిగ్గా వారి కళ్ళలోకి చూస్తే తెలిసిపోతుంది వారు అబద్ధం ఆడుతున్నారని.
బంధమ్లో ఏదో మార్పు వస్తుందనుకున్నప్పుడు మీరు దాన్ని గట్టి పర్చడానికి ప్రయత్నిస్తుంటే అవతలి నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గమనిస్తే, వారు మీతో ఉండడానికి ఇష్టపడట్లేదని గుర్తుంచుకోండి.
ఎప్పుడూ మీ పక్కనే ఉంటున్నప్పటికీ మీతో ఎంతో ఉన్న దూరంలో ఉన్న ఫలింగ్ ని మీకు కలిగిస్తారు. దూరం దూరంగా ఉంటూ తక్కువ మాట్లాడుతూ, కొన్ని కొన్ని సార్లు అసలే మాట్లాడకపోవడం చేస్తున్నారంటే వారు మీతో ఎక్కువ రోజులు ఉండాలని అనుకోవట్లేదన్నమాటే.