డైరీ వ్రాయడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలుసా..?

-

చాలా మందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ప్రతి రోజు వాళ్ళు వ్రాసే విషయాల్ని డైరీ లో రాసుకుంటారు. లేదా ఏమైనా పనులు చేసిన వాటిని డైరీ లో నోట్ చేస్తూ ఉంటారు. అయితే డైరీ రోజు రాయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

మీ థాట్స్ ని భద్రపరుస్తుంది:

ప్రతి రోజూ మనం ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాం. అలానే మన టైం ని ఎన్నో విధాలుగా స్పెండ్ చేస్తూ ఉంటాం. డైరీ లో ఇలా మన ఆలోచనలని రాయడం వల్ల ఫీలింగ్స్, ప్రదేశాలు, ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాటిని అది భద్రపరుస్తుంది. దీని వల్ల తిరిగి చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.

హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది:

ప్రతి రోజు డైరీ రాసుకోవడం వల్ల మీ చేతి రాతని అది మెరుగు పరుస్తుంది. దీనితో మీకు కొత్త రైటింగ్ నేర్చుకోవాలి అన్న కూడా బెనిఫిట్ అవుతుంది. ఏదైనా సరే మంచి వ్రాత నేర్చుకోవడానికి డైరీ చాలా బాగా సహాయం చేస్తుంది.

మీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది:

ఎప్పుడైనా మనం మన గోల్స్ కోసం దానిలో రాసుకుంటూ ఉంటే అది ఒక రిమైండర్ లాగ పని చేసి గుర్తు చేస్తుంది. దీనితో సులువుగా మన ఎయిమ్స్ ని చేరుకోవడానికి ఒక వెలుగు లాగ ఉంటుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

డైరీ రాయడం వల్ల మన బాధలు, మన ఆనందాలు ఇలా ప్రతీ దానితో షేర్ చేసుకుంటూ ఉంటాం కదా..! దీని వల్ల మన ఒత్తిడి కూడా తగ్గుతుంది.

క్రియేటివిటీని పెంచుతుంది:

సరదాగా రాసుకోవడం పక్కన చిన్న చిన్న బొమ్మలు వేయడం మొదలు మంచిగా క్రియేటివిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది.

మెమరీని పెంపొందిస్తుంది:

ప్రతి రోజు డైరీ రాసుకోవడం వల్ల మెమరీ పవర్ ని పెంచడానికి కూడా సహాయం  చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news