ఆ దేశంలో విడాకులు తీసుకునే వీలే లేదు..! ప్రజలు నీచంగా భావిస్తారట

-

పురాతనకాలంలో అంటే ఏక్ పతి, ఏక్ పత్నీ అన్నట్లు ఉండేవాళ్లు. కట్టుకున్న భర్త ఎలాంటోడైనా సరే చనిపోయే వరకూ కలిసే ఉండేవాళ్లు..కాలం మారింది..కట్టుబాట్లు మారాయి..భర్త చేసే ఆగడాలు భరించలేక చాలామంది విడిపోయి బతుకుతున్నారు.. ఇంకొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. మన భారతదేశంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య తక్కువే..అలా అని అందరూ కలిసి ఏం లేరు..విడిపోయి ఎవరి జీవితం వాళ్లు జీవిస్తున్నారు. విడాకులు ఆప్షన్ పక్కనపెట్టారు అంతే..కానీ ఈ ప్రపంచంలో విడాకులు తీసుకోవాడనికి వీలులేని ఏకైక దేశం ఒకటి ఉంది. అక్కడ విడాలుకులకు అనుమతి లేదు..అదేనండి..ఫిలిఫ్పీన్స్ లో విడాకులకు వీలులేదట..ఎందుకో ఏంటో మనమూ తెలుసుకుందాం..!

 

ఫిలిప్పీన్స్‌లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్‌లే ఉన్నారు. క్యాథలిక్‌ పద్ధతులను పాటించే వారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదట. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేకుండా పోయింది. . 2015లో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా.. ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడం అంటే.. అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్‌ అభ్యర్థనను సైతం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టేసింది. ప్రపంచంలో విడాకులే లేని దేశం తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక అంట.

అమెరికా హస్తగతంలో ఆ నిబంధనతో చట్టం చేశారు..

 

ఫిలిప్పీన్స్‌ను మొదట్లో స్పెయిన్‌ స్వాధీనం చేసుకొని కొన్ని శతాబ్దాలు పాలించిన విషయం చరిత్ర చెబుతోంది.. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు క్యాథలిక్‌ క్రైస్తవులుగా మారారు. దీంతో క్యాథలిక్‌ సంప్రదాయాలు, కట్టుబాట్లు వారిలో జీర్ణించుకుపోయాయి. అందుకే విడాకులు తీసుకోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు. అధికారికంగా వారు విడిపోలేరు. కాబట్టి ఎవరైనా సరే.. భార్య/భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా అలా విడిగా ఉంటే, వారిని అక్కడి ప్రజలు నీచంగా చూస్తారు. అయితే, 1898లో స్పానిష్‌-అమెరికా యుద్ధం జరిగింది. అప్పుడు స్పెయిన్‌ అధీనంలో ఉన్న ఫిలిప్పీన్స్‌ అమెరికా హస్తగతమైంది. ఆ తర్వాత అమెరికా పాలకులు ఫిలిప్పీన్స్‌లో విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే మనలాగా కాకుండా..ఒక నిబంధనమీద విడాకుల చట్టం పెట్టారు..అదేంటంటే.. భార్యభర్తల్లో ఎవరో ఒకరు వ్యభిచారం చేస్తున్నట్లు తేలితేనే విడాకులు మంజూరు చేయాలని చట్టం చేశారు.

జపాన్ మార్చేసింది..

 

రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఫిలిప్పీన్స్‌ను జపాన్‌ ఆక్రమించింది. అమెరికా చేసిన విడాకుల చట్టాన్ని జపాన్‌ రద్దు చేసి మరో చట్టాన్ని తెచ్చింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు అమలులో లేదు. 1944లో తిరిగి అమెరికా ఫిలిప్పీన్స్‌ను ఆక్రమించుకోవడంతో పాత విడాకుల చట్టాన్నే తిరిగి అమల్లోకి తెచ్చింది. కాగా.. 1946లో అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిలిప్పీన్స్‌ అమెరికా, జపాన్‌ చేసిన చట్టాలను తొలగించేసింది.. అసలు తమ దేశ చట్టాల్లో విడాకులన్న పదమే లేకుండా చేసింది. అయితే, ఆ దేశంలోని మైనార్టీ ముస్లింలు మాత్రం తమ మతాన్ని అనుసరించి విడాకులు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వీలు కల్పించింది.

బిల్లులు రూపొందించినా..చట్టరూపం దాల్చలేదు..

విడాకులను చట్టబద్ధం చేయడానికి పలుమార్లు విడాకుల ముసాయిదా బిల్లు రూపొందించినా ఇప్పటికీ దానికి చట్టసభల్లో ఆమోదముద్ర పడలేదు. కొన్ని నెలల కిందట రూపొందించిన డ్రాఫ్ట్‌ బిల్లును జనాభా, కుటుంబ సంబంధాలశాఖ కమిటీ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దాని రూపకర్తలు అంటున్నారు. దీనికి చట్టసభల్లోనూ ఆమోదం లభించాలని కాంక్షిస్తున్నారు. మరోవైపు క్యాథలిక్‌ పద్ధతులను అనుసరించే పాలకులు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆమోదిస్తే వివాహం, కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ దేశంలో విడాకులు తీసుకోవటానికి వీలులేకుండా వస్తుంది. మీరేమంటారు..ఇలా ఉండటం కరెక్టా కాదా.!

Read more RELATED
Recommended to you

Latest news