KGF: రాకీ భాయ్ క్రేజ్ మామూలుగా లేదుగా… యష్ టాటూలతో ఫ్యాన్స్ హల్చల్

-

ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ లవర్స్ చూపు మరో సౌత్ సినిమాపై పడింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోంది. కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.  సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

గతంలో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 ఇండియాలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. కన్నడ నుంచి ఓ సినిమా ఇంత పెద్ద హిట్ కావడం మునుపెన్నడూ చూడలేదు. రాకీ భాయ్ హీరోయిజానికి బాలీవుడ్ తో సహా సౌత్ ఇండస్ట్రీలు ఫిదా అయ్యాయి. ప్రశాంత్ నీల్ టేకింగ్ ను అంతా ప్రశంసించారు. 

ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ట్రిపుల్ ఆర్ రికార్డ్ వసూళ్లు క్రియేట్ చేస్తుంటే… మళ్లీ సౌత్ ఇండియా నుంచి వస్తున్న కేజీఎఫ్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ నాట కేజీఎఫ్ మానియా మామూలుగా లేదు. ప్రత్యేకించి హీరో యష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు రాకీ భాయ్ ఫోటోలను ఒంటిపై టాటూలుగా వేయించుకుంటున్నారు. 

‘ బాస్’ అంటూ టాటూలు వేయించుకుంటున్నారు. యష్ గత సినిమాల్లో ఉన్న లుక్స్ తో చేతులు, గుండెలపై టాటూలు వేయించుకుంటున్నారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news