వందేళ్లు దాటినా ఫుడ్‌ లవర్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న రెస్టారంట్లు ఇవే!

-

ఈరోజుల్లో బిజినెస్ చేయటం చాలా కష్టమైన పని..మన దగ్గర పెట్టుబడి, డబ్బు ఉన్నా..కష్టమర్లను నమ్మకం సంపాదించుకోవటం చాలా ముఖ్యం. వ్యాపారం ఎక్కువరోజులు నిలబడాలి అంటే..కష్టమర్లు మనల్ని నమ్మాలి. ఒకవేళ నమ్మినా..సంవత్సరాల తరబడి అందులో మనం బిజినెస్ చేయలేం. కాని వందేళ్లు దాటినా..కూడా అదే వ్యాపారం చేస్తూ..అంతే జోరు కొనసాగిస్తున్న రెస్టారెంట్లు ఉన్నాయంటే నిజంగా చాలా ఆశ్యర్యంగానే అనిపిస్తుంది కదా..బయట ఫుడ్ కు సంబంధించి.. ఒకసారి వెళ్లినప్పుడు అది నచ్చింది అంటే..మనం ఎప్పుడు తినాలన్నా అక్కడికే వెళ్తాం..ఒకవేళ మనం వెళ్లినప్పుడు ఆ ఫుడ్ కానీ..వాళ్ల సర్వీస్ లు కానీ నచ్చకుంటే..ఇక ఎప్పటికి ఆ రెస్టారెంట్ ముఖం చేసేది ఉండదు. వందేళ్లకు పైగా సేవలందిస్తూ తమ కమ్మని వంటకాలతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లు గురించి ఇప్పుడు చూద్దాం.

గ్లెనరీ, డార్జిలింగ్

ఇది మంచి పర్యాటక ప్రదేశం. డార్జిలింగ్‌లో కూడా ఫేమస్‌ రెస్టారంట్‌ ఉంది. అదే గ్లెనరీ రెస్టారంట్‌. దాదాపు 130 ఏళ్ల నాటి నుంచి కమ్మని వంటకాలతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. గ్లెనరీ రెస్టారంట్‌ విదేశీ అనుభూతిని కలిగిస్తోంది. ఇందులో ప్రతి ఒక్క వంటకం అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెస్టారంట్‌కు వెళ్లాలనుకునేవారు బేక్‌డ్‌ పదార్థాలను తప్పక టేస్ట్‌ చేయాలని చెబుతారు. ఈ రెస్టారంట్‌ రద్దీగా, ఇరుకుగా ఉండే నెహ్రూ రోడ్డులో ఉంటుంది.

ఇండియన్‌ కాఫీ హౌస్‌, కోల్‌కతా

1876లో కోల్‌కతాలో మొదటి ఇండియన్‌ కాఫీ హౌస్‌ను ప్రారంభించారు. దీన్నే మొదట్లో అల్బర్ట్‌ హాల్‌గా పిలిచేవారట. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్‌ కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. చాలా మంది దీన్ని ఐసీహెచ్‌గానూ పిలుస్తుంటారు. ఈ రెస్టారంట్‌ కాఫీ, అల్పాహారం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 5 స్టార్ హోటల్‌ను తలపించేలా ఉంటూ మంచి అనుభూతిని ఇస్తుంది.

టండే కబాబ్‌, లఖ్‌నవూ

ఈ హోటల్ లో లఖ్‌నవూలో ప్రసిద్ధి చెందిన మొగులాయి వంటకాలే కాదు అక్కడ టండే కబాబ్‌ కూడా చాలా ఫేమస్‌. టండే కబాబ్‌ అనేది కబాబ్‌లో ఒక రకం వంటకం కాకపోయినా దీన్ని తయారుచేసిన ఓ దివ్యాంగుడు సరదాగా టండే అని దానికి నామకరణం చేశాడు. అప్పటినుంచి దీన్ని అందరూ టండే కబాబ్‌ అని పిలవడం మొదలుపెట్టేశారు..ఈ రెస్టారంట్‌ 115 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇదే ఫేమస్. ఇందులో తయారు చేసిన కబాబ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి రెస్టారంట్‌లోకి అడుగుపెట్టగానే దాని వాసనకు నోరు ఊరుతుందని వెళ్లినవారు చెబుతుంటారు .

లియోప్లాడ్‌ కేఫ్‌, ముంబయి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 150 ఏళ్ల నాటి రెస్టారంట్ ఇది..దాని‌ పేరే లియోప్లాడ్‌ కేఫ్‌. ఇది ఇప్పటికీ చూడటానికి ఎంతో అందంగా ఉంటూ అక్కడికి వచ్చే భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. 2008లో జరిగిన ముంబయి దాడుల్లో ఈ కేఫ్‌పైనా బుల్లెట్ల వర్షం కురిసిందట. అయితే, అక్కడ ఇప్పటికీ బుల్లెట్ గుర్తులు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెస్టారంట్‌ పర్యాటకులను సైతం ఎంతగానో ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ప్రేమికుల ఫేవరేట్‌ ప్లేస్‌గానూ దీనికి మంచి పేరుంది.

కరీమ్, దిల్లీ

న్యూదిల్లీలో జామా మసీదుకు సమీపంలోని కరీమ్ రెస్టారంట్ ఉంటుంది. ఇది‌ కూడా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ దీనికి ఆహారప్రియుల తాకిడి బాగా ఉంటుంది. దీన్ని 1913లో హాజీ కరీముద్దీన్ ప్రారంభించారు. ఆయన నవాబ్‌ రాయల్‌ వంటకాలు చాలా బాగా చేస్తారని అక్కడివారు అనేవారు. ఆయన బాటలోనే ఈ రెస్టారంట్‌ను నడిపిస్తున్నారు. 5 స్టార్‌ హోటల్‌లో వండే చెఫ్‌ కూడా ఇంత అద్భుతంగా వండలేరని అక్కడి భోజనప్రియులు అంటుంటారు.

ఎప్పుడైనా ఈ ప్రదేశాలకు ఈ రెస్టారెంట్ లో ఫుడ్ మీరు ఓ సారి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news