ఘట్ కేసర్ లో తాడిచెట్టుపై పడిన పిడుగు.. కాలిపోయిన తాడిచెట్టు.. వీడియో

-

ఘట్ కేసర్ లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావడంతో పాటు.. అక్కడే ఉన్న ఓ తాడి చెట్టు మీద పిడుగు పడింది. దీంతో తాడిచెట్టు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియోలు తీశారు.

ఈ ఎండాకాలం సాయంత్రం అయిందంటే చాలు.. గాలి దుమారాలు, సుడిగాలులు, అకాల వర్షాలు, రాళ్ల వానలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో అకాల వర్షాలు వస్తున్నాయి. గాలి దూమారాలు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో నగర వాసులను భయబ్రాంతులను గురి చేస్తున్నాయి. నిన్న రాత్రి కూడా వర్షం కురిసింది. అయితే ఘట్ కేసర్ లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావడంతో పాటు.. అక్కడే ఉన్న ఓ తాడి చెట్టు మీద పిడుగు పడింది.

పిడుగుపాటుకు గురైన తాడిచెట్టుపై క్షణాల్లో మంటలు వ్యాపించాయి. తాడిచెట్టు చూస్తుండగానే క్షణాల్లో బూడిదైపోయింది. తాడిచెట్టు కాలిపోతుండగా… అక్కడి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. పిడుగుపాటుకు గురైన తాడిచెట్టు ఎలా కాలిపోయిందో మీరే చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version