మహిళలు తప్పక తెలుసుకోండి.. కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..!

ఆడవారి ఫ్యాషెన్ ప్రపంచంలో ఎన్నో రకాల మేకప్ కిట్స్, మరెన్లో రకాల ట్రెండింగ్ క్లాత్స్ ఉన్నాయి. హీల్స్ దగ్గర నుంచి..తలకు పెట్టుకునే క్లిప్ వరకూ అన్నీ ట్రెండింగ్ గా..అందంగా ఉండాలనుకుంటారు. కొందరికి గోళ్లు ఎంతపెంచినా పెరగవు..కనుబొమ్మలు అసలు పలుచుగా ఉంటాయి. ఒకప్పుడు ఇవి వారికి సమస్య కానీ..ఇప్పుడు వీటన్నింటికి ప్రత్యామ్మాయాలు వచ్చేశాయి. ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకుంటున్నారు. అచ్చం రియల్ నెయిల్స్ లానే ఉంటాయి. ఐబ్రోస్ కి పెన్సిల్స్ వాడుతారు. ఇంకా కనుబొమ్మలు..సాధారణంగానే ఇవి అందరికి తక్కువగా ఉంటాయి.కానీ చాలామంది అమ్మాయిలు.. వీటికి మస్కారా వాడుతారు. అందంగా కనిపించాలని..కానీ ఇంకొంతమంది అక్కడితో ఆగరు..ఆర్టీఫీషియల్ ఐలాషెస్ వాడుతారు. కానీ అవి చాలా ప్రమాదకరమట. ఇలా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కళ్లకే ప్రమాదం.

అసలు వెంట్రుకలను దెబ్బతీస్తుంది

కనురెప్పలకు కృత్రిమంగా వెంట్రుకలను అమర్చుతున్నారు. ఇలా చేయడం వల్ల నిజమైన వెంట్రుకలు దెబ్బతింటున్నాయి. దీని వల్ల కళ్లకి ఎఫెక్ట్ పడుతుంది. చూపు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మంట, వాపు వస్తాయి..సాధారణంగా బ్రాండెడ్‌ మేకప్ వస్తువులను వాడటం వల్ల కళ్ళకు హాని జరగదని మహిళలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కనుబొమ్మ వెంట్రుకలు పొడిగించడానికి వాడే జిగురులో ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది ఏ కంపెనీది వాడుతున్నారనేది కాదు కచ్చితంగా ఇది కళ్లకి హాని చేస్తుందనేది మహిళలు గమనించాలి.

కళ్ళ మంట, వాపు వంటి సమస్యలకు కారణమవుతుంది. ఒకవేళ మీరు చాలా కాలంగా కనురెప్పలకు మేకపు, వెంట్రుకల పొడవుకు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటే కొన్ని రోజుల తర్వాత వాటి దుష్ప్రభావాలు అనుభవించక తప్పదు అంటున్నారు సౌందర్య నిపుణులు. కళ్ళు మంట, వాపు, కనురెప్పలపై చికాకును అనుభవిస్తారు. అంతేకాదు కంటి ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. కళ్లు పొడిబారుతాయి. దీనివల్ల దృష్టికూడా మందగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.

వీలైనంత వరకూ..వీటిని వాడటం తగ్గించటం మంచిది. అంతేకాదు..మీరు ఎక్కువగా మేకప్ వాడుతున్నట్లైతే..వాటిని తగ్గించండి. ఇది ఒక్కటే కాదు..ఇంకా మీరు ఫేస్ కి వాడే క్రీమ్స్ కానీ లిపిస్టిక్స్ కానీ దీర్ఘకాలికంగా వాడితే..దుష్ప్రభవాలు ఎదుర్కోకతప్పదు. అన్ని రకాల మేకప్ సామాన్లలో రసాయనాలు ఉంటాయి. కాబట్టి తప్పదు వాడాలనుకునేవారు..తక్కువ కెమికల్స్ ఉన్నవి ఎంచుకోవటం బెటర్..అసలు ఈ ఐ లాషెస్ వాడకపోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.