మీ ప్రభుత్వానికి పాడె కట్టేది… మీ అధికారాన్ని పాతరేసేది రైతులే– వైఎస్ షర్మిళ

కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిళ. అన్నదాాత మరణాలపై ట్విట్టర్ వేదికగా విమర్మనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఇది వరకు కూడా రైతుల సమస్యలు, నిరోద్యోగం, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా ట్విట్టర్ లో …’’బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ఈ రోజు పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక.. పెట్టిన పెట్టుబడి రాక… ఆదుకోవాల్సిన సర్కార్ రైతు చావులను సర్కస్ లా చూస్తుంటే, కేసీఆర్ ను నమ్మలేక.. చేసేది లేక పురుగుల మందునే నమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొంటున్నారు రైతులు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ గారు ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదు. రైతు హంతకులు మీరు. రైతును కాటికి పంపుతున్న మీ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది మీ అధికారాన్ని

పాతరేసేది రైతులే.‘‘ అంటూ వ్యాఖ్యానించారు.