ఉత్తరప్రదేశ్‌లో ఇరుకు వీధిలో ఓ వ్యక్తి తన కారును రివర్స్ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించేశాడు. టైర్ల కింద మనిషి నలుగుతున్న విషయాన్ని కూడా గమనించకుండా రెండు సార్లు ముందుకు వెనక్కి వాహనాన్ని పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..?
యూపీలోని ఝాన్సీలో ఇరుకుగా ఉన్న గల్లీలో అప్పటికే రెండు వాహనాలను ఇరువైపులా నిలిపి ఉంచగా వాటి మధ్యలోంచి ఓ వ్యక్తి తన కారును రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రాజేంద్ర గుప్తా అనే 70 ఏళ్ల వృద్ధుడు అటుగా వెళ్లడం గమనించని డ్రైవర్‌ను వెనక్కి నడిపిస్తూ వృద్ధుడిని ఢీ కొట్టగా అతడు కిందపడ్డాడు. టైర్ల కింద మనిషి ఉన్న విషయాన్ని గుర్తించకుండా అతన్ని లాక్కొంటూ కొంతదూరం డ్రైవర్ అలాగే ఈడ్చుకెళ్లి కారును ముందుకు నడిపి మరోసారి వృద్ధుడిపైకి ఎక్కించాడు.
రాజేంద్ర గుప్తా అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని అతడిని బయటకు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు.
झांसी में दिल दहला देने वाला वीडियो आया सामने
कार के पीछे खड़े व्यक्ति को कार ने कुचला
पूरी घटना सीसीटीवी कैमरे में हुई कैद
सीपरी बाजार थाना क्षेत्र की बताई जा रही घटना#Jhansi | @jhansipolice #UttarPradesh pic.twitter.com/GI50GOGeAL— Abhitosh Singh अभितोष सिंह 🇮🇳 (@abhitoshsingh) May 24, 2024