Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ కన్ఫమ్ చేసిన హీరోయిన్

-

టాలీవుడ్ హీరోయిన్ శ్రుతిహాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రుతి క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టా వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనిథింగ్‌’ పేరిట ఫాలోవర్స్‌తో ముచ్చటించిన శ్రుతి తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి మాట్లాడింది. ఓ నెటిజన్‌ ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని అడిగిన ప్రశ్నకు.. ‘నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను. ఇప్పుడు నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్ను కన్ఫామ్ చేసేసింది.

దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతి హాసన్‌ ప్రేమలో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అతడితో దిగిన ఫొటోలను తరచూ పోస్ట్‌ చేస్తూ ఉండేది. కొన్ని నెలలుగా ఆమె ఎలాంటి ఫొటోలను షేర్‌ చేయకపోవడమే గాక ఇన్స్టాలో వీళ్లిద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడం, కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో బ్రేకప్ అయిందని నెట్టింట వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై శ్రుతి క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news