వైరల్ అవుతున్న వడాపావ్ వీడియో…!

Join Our Community
follow manalokam on social media

గత కొన్ని రోజుల క్రితం వేడి వేడిగా దోశలు వేసి వాటిని గాలి లోకి ఎగర వేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే రీతి లో మరొక వీడియో నెట్టింట్లో షికార్లు కొడుతోంది. ముంబై బోరా బజార్ స్ట్రీట్ లో ఇది చోటు చేసుకుంది. ఈ చెఫ్ చేసిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

రఘు దోస వాలా అనే ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లో వడా పావ్ ని కూడా అమ్ముతూ ఉంటారు. అలానే ఇక్కడ ఇడ్లీ, దోశ, చీజ్ మరియు మసాలా వడా పావ్ ని కూడా అమ్ముతుంటారు. ఈ వీడియోని ఒక వ్లాగర్ పోస్ట్ చేయడం జరిగింది.

వడా పావ్ ని ఈ చెఫ్ చేసి అలానే పాన్ లో బటర్ ని ఉంచి వడాస్ ని గాల్లో ఎగరవేసి మరొక చేత్తో దాన్ని పట్టుకుని తయారు చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో తీసిన వ్లాగర్ ఇక్కడ చేసి చీజ్ వడా పావ్ మరియు మసాలా వడ పావ్ నలభై రూపాయలకి వస్తుంది. పైగా చాలా విభిన్న రీతిలో ఇతను తయారు చేస్తాడు అని చెబుతున్నాడు.

గాల్లో ఎగరేసి పట్టుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా దీని రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుందని వీడియో తీసిన ఆ వ్లాగర్ చెప్తున్నాడు. అయితే ఇక్కడికి తినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారని కూడా అంటున్నాడు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...