వైరల్; ముస్లిం శుభలేఖపై రాధాకృష్ణుల ఫోటో…!

ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో ఒక ముస్లిం వివాహానికి సంబంధించిన శుభలేఖ ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఎందుకంటే ఇది గణేష్ మరియు రాధా-కృష్ణుల ఫోటోలతో ముద్రించారు. మార్చి 4 న తన కుమార్తె అస్మా ఖాటూన్ వివాహం కోసం హస్తినాపూర్ ప్రాంతంలోని మొహద్ సారాఫత్ ఈ ప్రత్యేక కార్డును ముద్రించారు. “హిందూ-ముస్లిం స్నేహాన్ని ప్రదర్శించడం మంచి ఆలోచన అని నేను అనుకున్నాను.

ముఖ్యంగా మత విద్వేషాలు పెరుగుతున్నప్పుడు. నా స్నేహితులు ఈ ప్రయత్నానికి చాలా సానుకూలంగా స్పందించారు” అని మొహద్ సారాఫత్ అన్నారు. అయితే, తన బంధువులు మరియు ముస్లిం స్నేహితుల కోసం, అతను ఉర్దూలో మరో వివాహ కార్డును ముద్రించాడు. “నా బంధువులు చాలా మంది హిందీ చదవలేరు మరియు వారి కోసం నేను ఉర్దూలో కూడా కార్డులు ముద్రించాను” అని ఆయన చెప్పారు.

కాగా దేశంలో మతం ఆధారంగా ఇప్పుడు విధ్వంశం జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ వాదంతో బిజెపి వెళ్తూ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తుందని పలువురు మైనార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున గత పది రోజులుగా హింస జరిగింది. ఈ పది రోజుల్లో దాదాపు 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ముద్రించిన ఈ కార్డు వైరల్ గా మారింది.