చాలా మందికి పొట్ట పెరగడం అనేది అతిపెద్ద సమస్య. ఆ సమస్యను అధిగమించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ డైట్ ఈ డైట్ అంటూ నరక యాతన పడతారు. పొట్ట ఉంటే చాలా సమస్యలు వస్తాయి అనేది వాస్తవ౦. లేగలేరు కూర్చోలేరు అనేది తెలిసిందే. ఇందుకోసం కొంత మంది జిమ్ కూడా చేస్తూ ఉంటారు. మరికొందరు ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
అయినా సరే ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అనేది వాస్తవం. పొట్ట మీద ముడతలు కూడా అతిపెద్ద సమస్య కొందరికి. నాజూకుగా కనపడాలి అంటే పొట్ట మాత్ర౦ తగ్గితే సరిపోతుంది. పొట్ట తగ్గి, ముడతలు పోయేందుకు కొన్ని చేస్తే చాలు అంటున్నారు. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్రను వేర్వేరుగా శుభ్రం చేసి వేర్వేరు గా వేయించాలని చెప్తున్నారు.
ఈ మూడు కలిపి పొడిగా చేసుకుని గాలి దూరని సీసా లేదా డబ్బాలో నిల్వ చేసుకోవాలని చెప్తున్నారు. రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీటిలో చెంచా చూర్ణం వేసి తాగాలి. దీన్ని తాగిన తర్వాత ఏమైనా తింటే ఉపయోగం ఉండదు. సరిగా మూడు నెలలు అంటే 90 రోజులు ఇలా చేస్తే పొట్ట తగ్గడంతో పాటుగా ముడతలు కూడా తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఇక నుంచి ఇది ట్రై చేసి చూడమని చెప్తున్నారు.