వైరల్‌ వీడియో: ఆపరేషన్‌ థియేటర్లో ఇద్దరు డాక్టర్ల మధ్య గొడవ..పేషంట్‌ను వదిలేసి మరీ..!!

-

సోషల్‌ మీడియాలో రోజు ఏదో ఒక వైరల్‌ వీడియో చెక్కర్లు కొడుతుంది.. అవి భలే ఫన్నీగా ఉంటాయి.. కొన్ని భయంకరంగానూ ఉంటాయి.. మరికొన్ని అయితే.. ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఆపరేషన్‌ థియేటర్లో ఇద్దరు డాక్టర్లు మధ్య గొడవ జరిగింది.. ఇద్దరు ఆపరేషన్‌ ఆపేసి మరీ తిట్టుకున్నారు.. రోగిని పక్కన పడేసి మరీ వీళ్లు ఇలా తిట్టుకోవడం ఎవరో సీక్రెట్‌గా వీడియో తీశారు.. మొత్తానికి వీడియో కాస్త వైరల్‌ అయింది…
సాధరణంగా ఆపరేషన్‌ థియేటర్‌ అంటే చాలా సైలెంట్‌గా సీరియస్‌గా ఉంటుంది. ఒక డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తుంటే.. అతనికి హెల్ప్‌ చేయాడానికి ఇంకొంతమంది డాక్టర్లు, నర్సులు ఉంటారు.. అంతా టెన్షన్‌గా ఫాస్ట్‌ ఫాస్ట్‌గా చేస్తుంటారు..కానీ ఇక్కడ మాత్రం ఫుల్‌ డిఫ్రెంట్.. వైరల్ అవుతున్న వీడియోలో ఆపరేషన్ థియేటర్‌లో కొంతమంది వైద్యులు కలిసి ఒక రోగికి శస్త్రచికిత్స చేయడానికి రెడీ అవుతారు.. అయితే ఏదో సమస్యపై ఇద్దరు వైద్యుల మధ్య అకస్మాత్తుగా గొడవ జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు..ఈ గొడవను అంతా ఎవరో తన మొబైల్ కెమెరాతో ఆపరేషన్ థియేటర్ లోపల నుంచి అన్నింటినీ రికార్డ్ చేశారు.
పాపం..ఆ పేషంట్‌ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. డాక్టర్లతో సహా టీమ్ అంతా అతని చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ తర్వాత మరో డాక్టర్ సర్జరీ చేస్తున్న డాక్టర్ రెచ్చిపోయి తమలో తాము వాగ్వాదానికి దిగారు.. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. లోపల నుంచి లైవ్ ఫుటేజీ రావడంతో జనం షాక్ అవుతున్నారు. ఒక డాక్టర్‌ అయితే కొట్టడానికి మీద మీదకు వెళ్తున్నాడు.. పక్కనే ఉన్న డాక్టర్లు చేతులు కట్టుకోని చోద్యం చూస్తున్నారే తప్ప అసలు ఆపడం లేదు. వీళ్లకు వచ్చిన సమస్య ఏంటో కానీ.. చాలా సీరియస్‌గా ఆపరేషన్‌ ఆపేసి మరీ తిట్టుకున్నారు. హైలెట్‌ ఏంటంటే.. ఈ వీడియోను తీసే వ్యక్తి వాళ్లకు ఎవరికీ తెలియకుండా.. పేపర్‌ అడ్డుపెట్టుకోని మరీ తీశాడు.. ఇది చూసిన నెటిజన్లు డాక్టర్లతీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version