పాములు కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

-

మనం నిద్రిస్తున్నప్పుడు సాధారణంగా రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని మనకు హాయినిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని కలలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా నిద్రలో మనకు వచ్చే కలల్లో ఎక్కువగా భయపెట్టేవి పాములు. పాములు కల్లోకి వచ్చిప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. సాధారణంగా మనకు వచ్చే కలలు మన జీవితంలో జరిగిన లేదా జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటారు కొందరు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని.. పాములు కలలో కనిపిస్తే శివుడికి మొక్కుకున్న మొక్కులు తీర్చలేదనే సంకేతమని ఇలా రకరకాలుగా భావిస్తుంటాయి. పాములు శరీరంపై పాకుతున్నట్లు, కాటేస్తున్నట్లు, బుస కొడుతున్నట్లు ఇలా రకరకాలుగా కలలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి దేనికి సంకేతమో తెలుసా.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

మన కలలో పాములు ప్రత్యక్షమైతే మంచిదేనని పూర్వీకులు నమ్ముతారు. అప్పట్లో పాములను పురోగతికి సంకేతాలుగా భావించేవారు. పాములు కలలోకి వస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతారని అర్థమని భావించేవారు. కొందరేమో పాములు కలలోకి కనిపిస్తే శివుడే కలలో కనిపించి తనకు మొక్కుకున్న మొక్కులు తీర్చలేదని గుర్తుచేస్తారని భావిస్తారు.

పాము కాటేసినట్లు లేదా మింగేస్తున్నట్లు కల వస్తే దేనికి సంకేతమంటే.. పాము మిమ్మల్ని కాటేస్తున్నట్లు కల వస్తే.. అది మీ జీవితంలో ఏదైనా ఒకటి వదిలేయాలని సూచిస్తుంది. అది ఇతరులతో బంధం కావచ్చు, ప్రియమైన వ్యక్తి కావచ్చు లేదా ఏదైనా వస్తువు కావచ్చు. వాటికి మీరు దూరం అవ్వడమో.. లేదా అవే మీకు దూరమవుతాయనో అర్థమంట.

పాములు మీరు నిద్రిస్తున్న మంచం మీద కనిపిస్తే దానికి అర్థమేంటంటే.. స్నేక్ డ్రీమ్స్‌ ఫ్రూడియన్ అనాలసిస్ ప్రకారం.. కొన్ని కలల్లో పాములు పురుషులకు ప్రతీక. మహిళలకు పాములు మంచం మీద కదులుతున్నట్లు కలలోకి రావడం.. లైంగిక శక్తిని సూచిస్తాయంట. అంటే వారికి భవిష్యత్తులో ఒక రొమాంటిక్ అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. లైంగిక కోరికలు, సాన్నిహిత్యం, గోప్యతా భావనను పాములు తెలియజేస్తాయి. అంతేకాదు, మీరు విశ్రాంతి తీసుకోవాలని కూడా ఆ కలలు సూచిస్తాయి.

పాములు కల్లోకి రావడం ఒక హెచ్చరిక కూడా.. పాములు విషాన్ని సూచిస్తాయి. అంటే, పాములు కలలోకి వచ్చాయంటే.. మీకు ఎవరితోనే కీడు ఉందనే అర్థం. పాము కలలోకి వచ్చిందంటే.. మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని అర్థం. అలాగే, మీరు ఒక పని చేయడం వల్ల నష్టం వస్తుందని తెలిసినా.. అతి విశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది కాదని సూచిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని పాము కల సూచిస్తుందని పెద్దలు భావించేవారు. ఇది మీకొక ట్రిగ్గర్ వార్నింగ్ లా అన్నమాట.

పాములను మీరు ఇష్టపడతారా? ద్వేషిస్తారా?: పాముల గురించి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా కలల ఫలితాలు ఉంటాయట. పాములను మీరు దైవంగా కొలిస్తే.. అవి కలలోకి వచ్చినా ఆందోళన అక్కర్లేదు. ఒక వేళ మీరు పాములను ద్వేషిస్తున్నా, భయపడుతున్నా.. కలల ఫలితం వేరేగా ఉంటుందట. అలాగే పాములను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారికి.. ఈ కలలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవట. ఏది ఏమైనా.. ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం. కొందరు వాటిని నమ్మతారు. మరికొందరు అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపడేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news