ఇండియాలో టెక్నో నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. Techno Camon 19 Pro 5G స్మార్ట్ ఫోన్.. ఫోన్ అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి. మరీ ఈ ఫోన్ విశేషాలంటే చూద్దామా..!
టెక్నో కామోన్ 19 ప్రో 5జీ ధర..
ఈ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.21,999గా నిర్ణయించారు.
సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
టెక్నో కామోన్ 19 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్‌ను 13 జీబీ వరకు పెంచుకోవచ్చు.
గేమింగ్ కోసం మీడియాటెక్ హైపర్ ఇంజిన్ 2.0ను కూడా ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో కామోన్ 19 ప్రో 5జీ పనిచేయనుంది.
5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
దీని మందం 0.86 సెంటీమీటర్లుగా ఉంది.
కెమెరా క్వాలిటీ…
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.