రోడ్డుపై ట్రాఫిక్ ఉంటే వాహనాలు వెళ్లడం కష్టం.. అందుకే అంతరాయం. ఇక వర్షాలు పడుతుంటే రోడ్డు మీద ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ విమానాలు అలా కాదు. వర్షం పడుతుంటే విమానాల ప్రయాణాలను రద్దు చేస్తారు. రన్‌వేపై టేక్‌ఆఫ్‌కు ఇబ్బంది అవుతుందని ఆపేస్తారని మనం అనుకుంటాం. వర్షం పడేప్పుడు పిడుగులు పడటం సాధారణం. విమానం పిడుగు పడితే..? అందుకే విమానాలు ఆపేస్తారా..?
సాధారణంగా వెదర్ అనుకూలించని సమయంలో విమానాలను నడపరు. దగ్గర్లోని ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ చేసేసి.. పరిస్థితి అనుకూలించిన తరువాత తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే, లాండింగ్ అవ్వడానికంటే ముందే వర్షం పడుతున్నప్పుడు.. పిడుగులు పడే అవకాశం ఉన్నపుడు ఏమి జరుగుతుంది..?మీకెప్పుడైనా ఇలాంటి సందేహం వచ్చిందా..? ఏడాదికి ఒక్క సారి అయినా విమానంపై పిడుగు పడే అవకాశం ఉంటుంది. చిన్న పిడుగు అయినా పెద్ద పిడుగు అయినా పిడుగు విమానం పై పడడం వలన విమానం పై నల్లగా మచ్చలు ఏర్పడతాయి.
ఒక వేళ, ఈ పిడుగు కాక్‌పిట్ లేదా ఇంధన ట్యాంకులపై పడితే.. అది మరింత ప్రమాదం. అందుకే, విమానంపైన ఒక రకమైన రాగి జాలీని వేస్తారు. పిడుగులు పడినప్పుడు వచ్చిన విద్యుత్‌ని గ్రహించేస్తుంది. లోపలకు రానివ్వదు. అందుకే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ.. ఇది చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది. పైలట్‌లు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. వెదర్ అనుకూలించని పరిస్థితిల్లో విమానాన్ని నడపరు.
సో.. విమానం పిడుగుపడితే విమానం కాస్త డ్యామేజ్ అవుతుంది కానీ లోపల ఉన్న ప్రయాణికులకు ఏం కాదనమాట. అందుకే వర్షం పడుతున్నప్పుడు విమానాలను ఆపేస్తారు.