Women’s Day : స్త్రీ ఎలా ఉండాలి.. మహిళల గురించి వేదాల్లో ఏముంది?

-

మహిళలు.. స్త్రీ… ఉమెన్‌.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్న స్త్రీ లేనిది ఈ ప్రపంచం లేదనేది వాస్తవం. అలాంటి స్త్రీ విషయంలో సనాతనధర్మంలో ఏం చెప్పబడింది? నిజంగా స్త్రీలను వేదాల్లో ఏ పనిచేయవద్దని, చదువుకోవద్దని, బయటకు రావద్దని ఉందా? అసలు వేదాలు ఏం చెప్పాయి అనే విషయంపై ఆయా వేదాలు చదివిన వారు చెప్పిన విషయాలను తెలుసుకుందాం…

స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03
స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74
స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2
స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – అధర్వణవేదం 7.47.1

పరిపాలన విషయంలో స్త్రీలు
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి – అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-

ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి)లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది-

ఋగ్వేదం 3.31.1
కుటుంబం, సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

ఉద్యోగాల్లో
స్త్రీలు కూడా రథాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజుర్వేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్‌ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26
విద్యా విషయాల్లో స్త్రీలకు పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.

వివాహం – విద్యాభ్యాసం విషయంలో పరిశీలిస్తే… ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు – అధర్వణవేదం 14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు. అదండి స్త్రీల గురించి వేదాల్లో చెప్పిన విషయాలు. అసలు వేదాలనే చదవకుండా ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని, మధ్యలో వచ్చిన కొన్ని అనాగరిక ఆచారాలను ముందుపెట్టి వేదాలు తప్పు, స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వలేదు వంటి అనేక తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారు. వేదాలను డిక్షనరీ అర్థంతో కాకుండా వాటికి సంబంధించిన డిక్షనరీ అంటే నిరుక్త అర్థం తెలిసినవారు చెప్పిన అంశాలను తెలుసుకుని మాట్లాడటం మంచిది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news