హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి నాడు ఎక్కడ ఉన్న వాళ్ళు అయినా సరే సొంత ఊరికి వచ్చి పండగ జరుపుకుంటూ ఉంటారు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా సంక్రాంతి ఇండియాలో జరుపుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.
అయితే మరి హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండగ ఎప్పుడు వచ్చింది…? ఆరోజు ఏం చేయాలి ఎటువంటివి తప్పక ఆచరించాలి..? అనే ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. మకర సంక్రాంతి సినిమాల్లో చూపించినట్టు అందంగానే ఉంటుంది. పల్లెల్లో అయితే మరీ బాగుంటుంది. సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, పిండి వంటలు ఇలా కొత్త అల్లుళ్లతో కుటుంబ సభ్యులతో ఎంతో అందంగా జరుపుకుంటూ వుంటారు. నిజానికి ఇది అచ్చమైన తెలుగు పండుగ. త్వరలోనే ఈ పండుగ రాబోతుంది.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది..?
జనవరి 14వ తేదీ రాత్రి 8:21 గంటలకు సూర్య దేవుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకోవాలి కనుక జనవరి 15వ తేదీ అనగా ఆదివారం నాడు వచ్చింది పండుగ. జనవరి 14వ తేదీ కనుక భోగి ఆ ముందు రోజు అవుతుంది. కనుమ పండుగ తరవాత రోజు అవుతుంది. సంక్రాతి నాడు సూర్య భగవానుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సంక్రాతి నాడు వీటిని తప్పక అనుసరించండి:
సంక్రాతి నాడు దాన ధర్మాలు చేయడం మంచిది.
సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చాలా మంది. సంక్రాతి నాడు సూర్య భగవానుడిని పూజించడం వల్ల అనుకున్నది అవుతుంది.
బెల్లం, నువ్వులు లేదా శనగపప్పు దానం చేస్తే కూడా శుభ ఫలితాలను పొందొచ్చు.