చాలా మంది చెవులు శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్స్ వాడతారు. అయితే ఈ పద్ధతి మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం… చెవి చాల డెలికేట్ గా, కాంప్లెక్స్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది. అది సౌండ్ వేవ్ ని కలెక్ట్ చేసుకుని మనకు విన పడేలా చేస్తుంది. ఒకవేళ కనుక చెవిని శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్ ని ఉపయోగిస్తే సెరుమెన్ శుభ్రం చేసుకునే బదులుగా మరి కొంత లోపలకి ఇయర్ బడ్ వెళ్ళిపోతుంది.
దీని కారణంగా తీవ్రమైన చెవి నొప్పి వస్తుంది. అదే విధంగా చెవుడు వంటి సమస్యలు కూడా రావచ్చు అని డాక్టర్లు అంటున్నారు. చెవిలో పిన్, వేలు లేదా ఇయర్ బడ్ వంటివి పెట్టడం ప్రమాదకరమని చెబుతున్నారు.
ఇయర్ బడ్స్ మనకి షాపుల్లో దొరుకుతాయి. దీంతో అందరూ సులువుగా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరం అని తెలుసుకోవాలి. అసలు చెవి లో ఉండే ఆ వ్యాక్స్ అంటే ఏమిటంటే…? చెవి చర్మం సెక్రిషన్స్, డెడ్ సెల్స్ మాత్రమే.
ఆ లూబ్రికెంట్ అక్కడ ఉండడం వల్ల చెవి కెనాల్ లో డ్రైనెస్ లేకుండా ఉంచుతుంది. ఇయర్ బడ్ ని మీ చెవు లో పెట్టుకోవడం వల్ల ఇయర్ వాక్స్ మరి కొంత లోపలికి వెళ్లి పోతుంది.
ఇయర్ బడ్స్ ని ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలు:
ఇయర్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల పూర్తిగా చెవుడు వచ్చే అవకాశం ఉంది. అలానే వికారం, వాంతులు, రుచి తెలియకపోవడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని స్పెషలిస్టులు చెబుతున్నారు. కాబట్టి చెవుని శుభ్రం చేసుకోవడానికి వాటిని వాడద్దు.