ఏ వైపు పడుకుంటే మంచిది.. దాన్ని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

-

రోజు మొత్తం శ్రమించి ఆఫీస్ లో వర్క్ మాత్రమే కాదు గంటల కొద్ది ప్రయాణం చేసి అలసిపోయి సాయంత్రం అనుకున్నది రాత్రికి ఇంటికొచ్చి చేరుతాం. అలా రావడం ఆలస్యం ఫ్రెష్ అవడం కాస్త డిన్నర్ చేయడం అలా మంచం ఎక్కడం ఇదే సగటు మనిషి పాటించే విధానం. అయితే అలసిపోయి వస్తారు కాబట్టి ఏ వైపుకి తిరిగి పడుకున్నా సరే నిద్రలోకి జారుకుంటారు.

కాని ఇక్కడ మన పడుకునే విధానానికి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయట. కొందరేమో ఎడమ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది అంటారు.. మరికొందరు కుడివైపు తిరిగి పడుకోవడమే కరెక్ట్ అంటారు.. అసలు ఎటు వైపు తిరిగి పడుకోవాలో తెలియక కొందరు సతమవుతుంటారు. ఏ వైపుకు పడుకోవాలో కరెక్టుగా తెలుసుకోవాలని ఉంటుంది అలాంటి వారికి నిద్ర ఎలా పడుకోవాలి.. ఏ వైపుకి పడుకోవాలి అన్న విషయాలను మనలోకం.కామ్ అందిస్తుంది.

నిద్ర ఎప్పుడూ ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవడమే మంచిది.. దీనిని పురాణాల్లో వామ కుక్షి అవస్థలో విశ్రమించడం అంటారు.. శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి, మధ్యనాడి అనే మూడు నాడులు ఉంటాయి. సూర్యనాడి తిన్న భోజనం జీర్ణం చేయడానికి పనికొస్తే.. సూర్యనాడి ఎడమవైపుకి తిరిగి పడుకుంటేనే చక్కగా పనిచేస్తుంది.

ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు ఎడమవైపుకి తిరిగి కొద్దిసేపు పడుకుంటే అలసట తీరిపోతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్ర ప్రసరణ బాగా జరుగుతుంది. కడుపులో పిండం, మూత్ర పిండాలకు మంచి రక్త ప్రసరణ లభిస్తుంది. వెన్ను నొప్పి వీపు నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

అంతేకాదు అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి పంపించడం కూడా ఎడవవైపు తిరిగి పడుకోవడం వల్ల జరుగుతుంది. కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేసేలా చూస్తాయి. ముఖ్యంగా ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పనిచేస్తుంది. గుండె మంట కూడా తగ్గిస్తుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. పార్కిన్ సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది. ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి.

Read more RELATED
Recommended to you

Latest news