శివాజిరాజా పరువు తీసిన యాంకర్ శ్యామల..!

అసలే మా ఎన్నికల్లో ఓడిపోయి పరాభవంలో ఉన్న శివాజి రాజా మా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ వ్యాఖ్యలకు రుసరుసలాడుతున్నాడు. శుక్రవారం నాడు నరేష్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా ఆయన పేరు ఎత్తకుండా స్పీచ్ కానిచ్చాడు శివాజి రాజా. ఇదిలాఉంటే శనివారం సాయంత్రం జరిగిన సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజి రాజా పరువు గంగలో కలిపేసిని యాంకర్ శ్యామల.

ఈవెంట్ లో భాగంగా శివాజి రాజా గారు కంగ్రాట్స్ మా అధ్యక్షుడిగా గెలిచినందుకు అన్నది శ్యామల. శివాజి రాజా మా అధ్యక్షుడిగా నిలబడ్డ వరకే తెలుసుకున్న శ్యామల ఎవరు గెలిచారు అన్నది తెలుసుకోలేదు అనుకుంటా అందుకే నరేష్ గెలిస్తే శివాజి రాజాకు కంగ్రాట్స్ చెప్పింది. అయితే గెలిచింది నేను కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ నేను కాదు మా ప్యానెల్ సభ్యులు కొంతమంది గెలిచారు అనగా.. వాళ్లని ముందుండి గెలిపించింది మీరేగా అంటూ మళ్లీ ఇరుకున పెట్టేసింది.

మరి సినిమా పరిశ్రమలో ఉంటూ మా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు అన్నది శ్యామలాకు తెలియదా అంటూ నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సూర్యకాంతం ఈవెంట్ లో శ్యామల చేసిన పొరపాట్లకు ఆమె అవగాహన లోపాన్ని బయటపెట్టుకుంది.