బ్రేకప్‌ లవ్‌ర్స్‌కు ఈ కంపెనీ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది..!

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవానికి జరపుకోవడానికి యువత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల అంటేనే ప్రేమికుల ముఖంలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. దుకాణాలు రకరకాల బహుమతులతో నిండిపోయాయి. ప్రేమికులు ఈ బహుమతులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. వాలెంటైన్స్ వీక్‌లోని ప్రతి రోజును గుర్తుంచుకుని, విషెస్ చేస్తూ, అందుకు తగ్గట్టుగా బహుమతులు ఇస్తూ ఆనందిస్తుంటారు.అయితే ఇదంతా కాయిన్‌కు వన్‌ సైడ్‌ మాత్రమే.. ఈ సంవత్సరం ప్రేమలో విఫలం అయిన వాళ్లకు ఈ ప్రేమికుల రోజు పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ప్రేమలో విఫలం అవడం కంటే.. ప్రేమలో మోస పోవడం అనేది ఇంకా బాధిస్తుంది. మీరు నమ్మి ప్రాణంగా ప్రేమించిన వారు మిమ్మల్ని ఘోరంగా మోసం చేశారు అంటే.. మీకు వారిపై పట్టలేనంత కోపం వస్తుంది, వాళ్లు ఇచ్చిన బహుమతులు, పంపిన మేసేజ్‌లను చింపిపారేయాలని అనిపిస్తుంది.. ఒక పక్క మోసంపోయాను అన్న బాధ.. ఇంకోపక్క ఈ బహుమతులు, ప్రేమ లేఖలకు కంటికి ఎదురుగా కనిపిస్తూ ఇంకో బాధ.. ఈ పెయిన్‌ను పోగొట్టడానికి కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి.. అర్థంకాలేదా..?

ఫ్లష్ అవుట్ ఆఫర్ : విరిగిన ప్రేమికుల బాధలను తగ్గించేందుకు హూ గివ్స్ ఎ క్రాప్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇది విచ్ఛిన్నమైన సంబంధాన్ని మరచిపోయి ముందుకు సాగడానికి అవకాశాన్ని ఇస్తుంది. ప్రేమలో మోసపోయి, ఆ తర్వాత వారి సంబంధాలు తెగిపోయిన వారికి ఈ సంస్థ ఆఫర్ చేస్తుంది.

హూ గివ్స్ ఎ క్రాప్ నిజానికి రీసైకిల్ చేయబడిన టాయిలెట్ పేపర్ కంపెనీ ఇది. ఇది మీ మాజీ ప్రేమికుల నుండి వచ్చిన బహుమతి, జ్ఞాపకాలను ఫ్లాష్ చేస్తుంది. పాత ప్రేమ లేఖలు, కార్డ్‌లు లేదా వాట్సాప్ చాట్‌ల ప్రింట్‌అవుట్‌లను టాయిలెట్ రోల్స్‌గా మార్చి కంపెనీ విక్రయిస్తోంది. తద్వారా ప్రజలు దీనిని ఉపయోగించుకోవచ్చు. వారి పాత చెడు జ్ఞాపకాలను కూడా వదిలించుకోవచ్చు.

కంపెనీ తన ప్లాన్‌కు ఫ్లాష్ యువర్ ఎక్స్ అని పేరు పెట్టింది. మీ చెత్త జ్ఞాపకశక్తి, డ్రాయర్‌లో పడి ఉన్న ప్రేమ లేఖలను మాకు మెయిల్ చేయండి. మేము వాటిని ప్రచారం కోసం ఉపయోగిస్తాము. వాటిని టాయిలెట్ పేపర్‌గా మారుస్తామని కంపెనీ తెలిపింది. చెడు జ్ఞాపకాలను టాయిలెట్‌లో ఉంచడం ఉత్తమం అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

మీకు మాజీ ప్రేమికుల నుండి ఉత్తరాలు, బహుమతులు, మెయిల్‌లు, సందేశాలు ఉంటే, వారి జ్ఞాపకాల నుంచి బయటపడటానికి ఇదే సరైన మార్గం అని మీకు అనిపిస్తే మీరు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మీ ప్రేమ లేఖను కంపెనీకి పంపండి. కంపెనీకి యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా మరియు బ్రిటన్‌లలో శాఖలు ఉన్నాయి. తమ చిరునామాలకు వ్యక్తులు పంపిన ప్రేమ లేఖలను కంపెనీ స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 29 వరకు లేఖలు పంపేందుకు కంపెనీ అవకాశం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news