కొన్ని సాంగ్స్ మైండ్‌లో ఎందుకు ఉండిపోతాయి? మీకు కూడా అలా అవుతోందా?

-

కొందరికి డైలీ సాంగ్స్ వినడం అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇంకా ఎప్పుడూ ఏదో ఒక సాంగ్ హమ్ చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా.. మనకు తెలియకుండానే.. ఒకటే సాంగ్ పాడుతుంటాం. అదే పాటను మాటిమాటికి వినాలిపిస్తుంది. అది మీకు నచ్చి అలా చేస్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈరోజు మనం ఇలా ఎందుకు అవుతుందో చూద్దాం.
ఈ రకమైన పరిస్థితిని ఇన్ వాలంటరీ మ్యూజికల్ ఇమేజెరీ (INMI) అంటారు. సింపుల్ గా ఇయర్ వార్మ్స్ (చెవి పురుగులు – earworms) అంటారు. ఈ సైకలాజికల్ పరిస్థితిని బ్రెయిన్ వార్మ్, స్టక్ సాంగ్ సిండ్రోమ్ (stuck song syndrome) అని కూడా పిలుస్తుంటారు.

కారణాలు ఇవే :

మళ్లీ మళ్లీ ఒకే పాట మైండ్‌లో మెదులుతూ ఉండటానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయట. ఆ పాట బాగుండటం, మధ్య మధ్యలో గ్యాప్‌తో పాడేందుకు అనుకూలంగా ఉండటం, మంచి టెంపో ఉండటం. సహజంగా ఈ మూడు లక్షణాలు ఉన్న పాటలు మనకు నచ్చుతాయి. ఇలాంటివే వైరల్ హిట్ అవుతాయి.
ఈసారి మీ మైండ్‌లో ఏదైనా పాట మళ్లీ మళ్లీ వస్తూ ఉంటే… దాన్ని మీరు గమనించండి. అందులో బీట్స్ బాగుంటాయి. మీరు చేసే పనితో దాని టెంపో సెట్ అవుతుంది. దానిలోని పదాలు, అల్లికలు మీకు బాగా నచ్చుతూ, క్యాచీగా అనిపిస్తాయి.. మీరు గమనించే ఉంటారు… గజిబిజిగా ఉండే పాటలు ఇలా మళ్లీ మళ్లీ మదిలో మెదలవు.

భావోద్వేగాలు:

మీకు అదే పనిగా వినిపించే పాటలో చక్కటి భావోద్వేగాలు కూడా ఉంటాయి. కొంతమంది లవ్ ఫెయిల్ అవుతారు. వారికి బాధతో కూడిన పాటలు నచ్చుతాయి. ఓదార్పును ఇస్తాయి.. వాళ్లకు అలాంటి పాటలు మైండ్‌లో వినిపిస్తాయి.అసలు ఆ లిరిక్స్ మనకోసమే రాశారా అన్నట్లు.. అన్నీ మన ప్రజెంట్ సిచ్చువేషన్ కు సింక్ అవుతాయి. దాంతో మనం మళ్లీ మళ్లీ అదే పాట వింటాం పాడతాం. మరికొందరు ఏ పరీక్షలోనో నెగ్గుతారు. వారు హుషారైన పాటలు వింటారు. మైండ్‌ కూడా ఓ మంచి సాంగ్‌ని తన దారిన తాను ఎంచుకొని… రిపీట్ రిపీట్ చేస్తుంది. అలా ఏ సాంగ్ ఇయర్ వార్మ్ అవ్వాలి అనేది మన మూడ్‌పై ఆధారపడి ఉంటుంది.

ఆ పాటను వదిలించుకోవడం ఎలా?

మళ్లీ మళ్లీ వస్తోంది కదా అని దాన్ని భరించడం అన్నిసార్లూ మనవల్ల కాదు. కాబట్టి… మెదడుని పక్కదారి పట్టించాలి. సాంగ్ టాపిక్ డైవర్ట్ అయ్యేలా చెయ్యాలి. అందుకోసం వేరే సాంగ్స్ వినండి. వేరే వీడియోలు చూడొచ్చు. ఇలా బ్రెయిన్‌కి పని పెడితే… అది బిజీ అయిపోతుంది. ఇంతకీ మీకు ఇప్పుడు ఏ సాంగ్ మైండ్ లో రన్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news