ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య కేసు పిటీషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నే తెలంగాణా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడనీ పిటీషనర్ తరపు న్యాయవాది అభినవ్… హై కోర్టు కు వివరించారు.
సాయి గణేష్ ఆత్మహత్య కేసు సీబీఐ తో విచారణ జరిపించాలని కోరారు అభినవ్. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్..
అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని… వెళ్ళందించారు. ఇక ఇరు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మొత్తం ఏడుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామన్న ఎజి..తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసిoది హైకోర్టు.