చైనాకు పాక్ సర్కార్ షాక్… చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ రద్దు

-

చైనాకు పాకిస్తాన్ లోని కొత్త ప్రభుత్వ భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఎకనామిక్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందని చెప్పబుతున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్( సీపీసీ) అథారిటీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని పాకిస్తాన్ ఆర్థిక వనరులను వృథా చేసే అనవసమైన సంస్థగా ప్రణాళిక మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశంగా భావిస్తున్న చైనాకు ఈ విషయం మింగుడు పడకపోవచ్చు. 

ఈ సీపీసీ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్ లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. పాక్ దక్షిణ భాగంలో ఉండే గ్వాదర్ పోర్ట్ నుంచి చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్ ను కలిపేలా రోడ్డు, రైలు మార్గాలను డెవలప్ చేసేందుకు చైనా ప్లాన్ వేసింది. ఈ నేపంతో చైనా తన ఉత్పత్తులను ఆఫ్రికా, మధ్యఆసియా దేశాలకు గ్వాదర్ పోర్ట్ ద్వారా తరలించాలని చూసింది. ఇదిలా ఉంటే సీపీసీ ప్రాజెక్ట్ భారత్ భూభాగం అయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్లడాన్ని భారత్ ఆక్షేపిస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా పాక్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. చైనా రుణ ఊబిలో  చిక్కుకుపోయింది. దీంతో పాక్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారింది. మరోవైపు పాక్ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్ లో చైనీయుల ఆగడాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం పాక్ తీసుకున్న నిర్ణయంతో చైనా ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news