చిన్నారులపై భోగిపండ్లు ఎందుకు పోస్తారంటే..?

-

సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు తెల్లవారుజామున భోగి పండుగ కూడా నిర్వహించుకున్నారు. అయితే భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా.. గోచార గ్రహస్థితిలో ఉన్న అన్ని చెడు కర్మలు తొలగడానికి. ఆ భోగి నుంచి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు ఉంచుతారు. అలాగే భోగి పండుగ సాయంత్రం ఐదేళ్లలోపు పిల్లలపై భోగి పండ్లను పోస్తారు.

ఐదేళ్లలోపు పిల్లలపై ఉండే అరిష్టాలు, దిష్టి వంటివి తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు రేగి పండ్లను పోస్తారు. ఐదేళ్ల వయసులో చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుందని, రేఖ అరా కూడా పలుచగా ఉంటుందట. అయితే రేగి పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాసన పిల్లల తలపైన బ్రహ్మ రంధ్రానికి శక్తి ఇస్తుందని, మేధస్సుకు శక్తి చేకూరుతుందని పెద్దల నమ్మకం.

భోగి పండుగ సాయంత్రాన ఐదేళ్ల చిన్న పిల్లలను కూర్చోబెట్టి తలపై రేగి పండ్లను పోస్తారు. అలా పోయడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజం అవుతాయని, రేగి పండ్ల వాసనతో మెదడు ఉత్తేజితం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల చిన్న పిల్లలు క్షిణించుకుపోతారు. రేగి పండ్లలో అరాను ఎక్కువగా ఆకర్షించే శక్తి ఉంటుంది. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలుపుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పిల్లలు శక్తి రావాలనే ఉద్దేశంతో రేగి పండ్లని పోస్తుంటారు. దీంతో పాటు పిల్లలకు సోకిన దిష్టి కూడా ప్రభావం తగ్గుతుంది.

రేగి పండ్లను తినడం వల్ల జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించే శక్తి ఉంటుంది. విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల ఉదర సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అందుకే రేగి పండ్లను ఎండబెట్టి వాటితో వడియాలు, రేగితాండ్రాలను చేసుకుని తినేస్తుంటారు. అలాగే దీనికి కారణం ఉంది. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. సూర్యుడి రంగులో ఉండే రేగి పండ్లను చిన్నపిల్లలపై పోస్తే సూర్యడు ఆశీస్సులు దొరుకుతాయని నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news