కేంద్రం నో అంటే.. మేమే ఫ్రీగా వ్యాక్సిన్‌ ఇస్తాం..!

-

దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన రాష్ట్ర ‍ ప్రజలకు ఓ భరోసా కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించకుంటే తన రాష్ట్రవాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ భరోసా కల్పించారు. గతంలోనే ఆయన కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మేము ఉచితంగా అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటనతో దిల్లీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్-19 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్‌ వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరానని ఒకవేళ తమ కోరికను అంగీకరించకుంటే తమ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని దీమా వ్యక్తం చేశారు. భారతీయులకు కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలని గతంలోనే ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ కేంద్ర ప్రభుత్వానికి కోరిన సంగతి విదితమే. వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరీ హక్కు అని దీన్ని దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని గతంలో ఆయన ట్విటర్‌ వేదికగా సైతం డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news