గుళ్ళల్లో ఎర్రదారాలను ఎందుకు అమ్ముతారు?..వాటిని ఎందుకు కట్టుకుంటాం?..వీటి వెనక ఎంతకథుందో తెలుసా..!

మనసు ప్రశాంత కోసం మనం గుడికి వెళ్తుంటాం. ఆ గుడిగంటలు, దేవుని నామస్మరణలు వింటుంటే టెన్షన్స్, ఆఫీస్ ప్రజర్స్, ఇంట్లో గొడవలు కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా అనిపిస్తుంది. ఇక్కడివరకూ బానే ఉంది. గుడిబయట దేవుడి దారాలు అమ్మే‌వాళ్లుంటారు. అవిఎక్కువగా ఎరుపు రంగులోనే ఉంటాయ్. మనం ఎరుపును డెంజర్ కి సంకేతంగా అనుకుంటాం..ఎరుపు చూసినప్పుడు మనసుకు కూడా ప్రశంతత ఉండదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు గుడిబయట ఈ ఎర్రని దారాలను అమ్ముతున్నారు. మనం కూడా చాలాసార్లు వాటినే కొనే ఉంటాం. మనం వాటిని చేతికి కట్టుకుంటాం. అసలు వీటిని ఏమంటారో తెలుసా. వీటిని ఎందుకు కట్టుకోవాలో తెలుసా. దీని వెనుక ఓ కథే ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఈ దారాలు ఎరుపు, నారింజ, పసుపు రంగులు కలగలిపి ఉంటాయి. వీటిని “మౌళి” అని పిలుస్తారట. ఈ దారాలను మౌళి అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే పురాణాల్లో బలి చక్రవర్తి గురించి, ఆయన దాన ధర్మాల గురించి తెలుసుకోవాలి.

బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వారికి అడిగింది లేదనకుండా దానం చేసేవాడు. తద్వారా ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు గడించాడు. అయితే బలి దానవ రాజు. బలిని అంతమొందించాలన్న ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి బ్రాహ్మణ రూపం ధరించి బలి వద్దకు వెళ్తాడు. తనకు మూడు అడుగుల నేల దానంగా కావాలని అడుగుతాడు. బలి ఇస్తాను అని చెప్పగానే.. వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఒక అడుగు నేలపైన, ఒక అడుగు ఆకాశం పైన పెడతాడు.

మరొక అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా.. బలి చక్రవర్తి తన శిరస్సుపైన ఉంచమని శిరస్సుని చూపిస్తాడు. అలా శ్రీ మహా విష్ణువు మూడవ అడుగుని బలి చక్రవర్తి శిరస్సుపైన ఉంచి పాతాళానికి నెట్టేస్తాడు. అయితే.. ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బలిపై శ్రీమహా విష్ణువు అభిమానంతో బలికి మృత్యుంజయుడిగా వరం ఇస్తూ.. మౌళి దారాన్ని బలి చేతికి కడతాడు.

ఈ మౌళి దారం మూడు రంగులతో ఉంటుంది. ఎరుపు, పసుపు, నారింజ రంగుల దారాలు కలగలిపి ఉండే ఈ మౌళి దారం కట్టుకోవడం వలన గ్రహపీడలు తొలగి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారట. ఈ దారాలు కంకణంలా ధరించడం వల్ల ఆర్ధిక ఇక్కట్లు రావని… ఈ మూడు రంగులు బుధుడు, కుజుడు, సూర్యుడులను ప్రతిబింబిస్తాయని.. ఈ దారాన్ని ధరిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు.

ఇంతకథ ఉందనమాట గుళ్లళ్లో ఇచ్చే దారాల వెనుక. చాలామందికి ఈ దారల వెనుక కథ తెలిసిఉండదు. ఈ సారి నుంచి గుడికి వెళ్లినప్పుడు ఈ దారలు(మౌళి) కొనేప్పుడే మీ ఆత్మీయులకు ఈ దారాల వెనుక కథ చెప్పి ఇవ్వండి. చాలా సంతోషిస్తారు.