రెండో వార్మప్ మ్యాచ్ లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ

-

టి20 వరల్డ్ కప్ వార్మ్ అప్ మ్యాచుల్లో టీమిండియా అదరగొడుతోంది. మొన్న జరిగిన ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించిన టీమిండియా ఇవాళ ఆస్ట్రేలియా జట్టుపై కూడా ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి… 17.5 ఓవర్ లో మాత్రమే చేదించింది టీమిండియా.

భారత బ్యాట్స్మెన్ లలో.. కేఎల్ రాహుల్ 39 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 60 పరుగులు రిటైర్డ్ హార్ట్, సూర్యకుమార్ యాదవ్ 38 పరుగులు నాటౌట్ మరియు హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేసి టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.

అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే స్టీవెన్ స్మిత్ 57 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 37 పరుగులు మరియు స్తోయినిస్ 41 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అయితే… లక్ష్యఛేదనలో ఎక్కడ తడబడకుండా టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక టీమిండియా 24వ తేదీన పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news