అమ్మతనం… జింక పిల్లకు పాలిచ్చిన మహిళ.. ఫోటో వైరల్

-

ఆ కమ్యూనిటీ జంతువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఫోటోనే ఉదాహరణ. తమ పిల్లలను ఎలా చూసుకుంటారో.. జంతువులను కూడా వాళ్లు అలా చూసుకుంటారు.. అంటూ పర్వీన్ కశ్వాన్ ఆ ఫోటోను ట్వీట్ చేశాడు.

ఓ మహిళ జింక పిల్లకు పాలు ఇచ్చింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ కే చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

woman breastfeeds baby deer in jodhpur

ఈ ఫోటోను చూసిన వాళ్లంతా.. ఇది అమ్మతనం అంటే. అమ్మతనం ఎంతో స్వచ్ఛమైనది.. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమను పొందడం నిజంగా అదృష్టం. జింక పిల్లకు తన సొంత బిడ్డలా పాలిచ్చిన ఆ మాతృమూర్తి కాళ్లకు దండం పెట్టాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి ఆ మహిళ.. రాజస్థాన్ లోని బిష్ణోయి అనే కమ్యూనిటీకి చెందిన మహిళ. ఆ కమ్యూనిటీ జంతువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఫోటోనే ఉదాహరణ. తమ పిల్లలను ఎలా చూసుకుంటారో.. జంతువులను కూడా వాళ్లు అలా చూసుకుంటారు.. అంటూ పర్వీన్ కశ్వాన్ ఆ ఫోటోను ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news