రోజులో మహిళలు 62 సార్లు నవ్వితే.. పురుషులు కేవలం 8 సార్లు మాత్రమే నవ్వుతారట…!

-

నిజంగా నువ్వు చాలా శక్తి కలిగి ఉంటుంది. ఎంత ఎక్కువ నవ్వితే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. నవ్వడం అనేది బ్రెయిన్ తో డైరెక్ట్ గా లింక్ అయ్యి ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఎవరైనా జోక్ చెప్పినా లేదంటే ఏదైనా నవ్వే సందర్భాలు వస్తే… నవ్వి ఆనందంగా ఉండొచ్చు.

కేవలం చిన్న నవ్వు నిజంగా చాలా చేస్తుంది. రోజుని ఎంతో మంచిగా, బ్రైట్ గా మార్చడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. దీనితో రోజు మొత్తం ఎంతో హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన నవ్వు నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఇది ఇలా ఉంటే ఒక్కసారి నవ్వితే తెలియని వారు కూడా స్నేహితులు అయిపోతారు.

నవ్వితే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అదే కోపంగా ఉంటే త్వరగా ముసలితనం వచ్చేస్తుంది. నవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే…? నవ్వితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మీపై విశ్వాసాన్ని కూడా నవ్వు పెంచుతుంది.

యావరేజ్ గా చూసుకుంటే మహిళలు అరవై రెండు సార్లు రోజుకి నవ్వుతారు. అదే పురుషులు అయితే కేవలం ఎనిమిది సార్లు మాత్రమే నవ్వుతారు. మనకి తెలియని మరొక విషయం ఏమిటంటే నవ్వు లో 19 రకాలు ఉన్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news