ప్రాణాంతక వైరస్ యొక్క 617 వేరియంట్‌లతో పోరాడే శక్తి భారతదేశంలోనే తయారయిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ కి ఉందని కనుగొన్నట్లు వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్, అమెరికా అగ్ర పాండమిక్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ లో ఫౌసీ విలేకరులతో మాట్లాడారు. ఇంకా రోజువారీ డేటా ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే భారతదేశంలో ఉపయోగించిన టీకా అయిన కోవాక్సిన్ 617 వేరియంట్లుతో పోరాడుతుందని ఆయన చెప్పారు.
“కాబట్టి, భారతదేశంలో మనం చూస్తున్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీకాలు వేయడం ద్వారా ఈ ఇబ్బందులకి విరుగుడు మొదలవచ్చని ఫౌసీ తెలిపారు. SARS-CoV-2 కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేయడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా కోవాక్సిన్ పనిచేస్తుందని న్యూయార్క్ టైమ్స్ మంగళవారం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ జనవరి 3 న అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడింది. ట్రయల్ ఫలితాలు తర్వాత టీకా 78 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేలింది.