ప్రపంచ నవ్వుల దినోత్సవం: నవ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

-

ప్రతి సంవత్సరం మే లో వచ్చే మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితం లో నవ్వు తప్పక ఉండాలి. నిజంగా నవ్వు ఒక దివ్యౌషధమని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు కి నవ్వు నిజంగా పరిష్కారం అనే చెప్పాలి.

ఎందుకు ప్రతి ఒక్కరు నవ్వాలి..?

నవ్వడం వల్ల ఆనందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. కేవలం నవ్వడం వల్ల మనుషులు దగ్గరవడం మాత్రమే కాదు. ఎంత ఎక్కువ నవ్వితే అంత ఆరోగ్యంగా బ్రెయిన్ ఉంటుంది. నవ్వు కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. తద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది.

నవ్వడం వల్ల కలిగే లాభాలు:

ఒత్తిడి తగ్గుతుంది:

నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఒత్తిడి కూడా పూర్తిగా దూరం అవుతుంది. మీ వర్క్ ప్రెషర్, ఒత్తిడి అన్ని కేవలం చిన్న నవ్వుతో మాయమైపోతాయి.

పాజిటివ్ థింకింగ్:

నవ్వడం వల్ల పాజిటివ్ గా ఉండడానికి వీలవుతుంది. నెగిటివిటీని దూరం పెట్టేస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్ మెయింటెన్ చేస్తుంది:

నవ్వడం నిజంగా మంచి వ్యాయామం. ఇది రక్తాన్ని బాలెన్స్ గా ఉంచుతుంది.

ఎన్నో సమస్యలని పోగొడుతుంది:

నవ్వడం వల్ల థైరాయిడ్, ఒబిసిటీ, ఆస్తమా, బీపీ, డిప్రెషన్, గొంతు సమస్య వంటివి ఉండవు.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

నవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా అనేక సమస్యలకు ఇది బెనిఫిట్ అవుతుంది.

గుండె పోటుకి అవకాశం తక్కువ:

నవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. గుండె ఇతర భాగాలకు రక్తం సరఫరా అవుతుంది ఇలా నవ్వడం వల్ల గుండె పోటు రిస్కు కూడా తగ్గుతుంది.

యాంటీ ఏజింగ్:

నవ్వడం వల్ల చర్మం కూడా బాగుంటుంది. యాంటీఏజింగ్ గా కూడా నవ్వు పనిచేస్తుంది ఇలా నవ్వుతూ ఎన్నో బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు.

మరి నవ్వుతూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి….

Read more RELATED
Recommended to you

Latest news