అంగారక‌ గ్ర‌హం పైకి మీ పేరు పంపవచ్చు. ఎలాగో తెలుసా..?

411

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మార్స్ 2020 పేరిట ఓ రోవర్‌ను అంగారక గ్రహంపైకి పంపనుంది. రోవర్ మైక్రోచిప్‌లో అంగారక గ్రహం పైకి నాసా  మన పేర్లను పంపుతుంది.

అంతరిక్షంలోకే కాదు, చంద్రుడిపైకి.. ఇతర గ్రహాలపైకి మనుషులను పంపడం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలు శాటిలైట్లను పంపడానికే ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది మనుషులను ఆయా ప్రాంతాల్లోకి పంపడమంటే మాటలు కాదు. అది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అయితే మనుషుల సంగతేమో కానీ… నాసా మాత్రం అంగారక గ్రహం పైకి మన పేర్లను పంపుతుంది. అవును.. నిజమే..!

you can send your name to mars know how

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మార్స్ 2020 పేరిట ఓ రోవర్‌ను అంగారక గ్రహంపైకి పంపనుంది. సదరు రోవర్ 2020 జూలై 17వ తేదీన భూమి నుంచి బయల్దేరి 2021 ఫిబ్రవరి 18వ తేదీన అంగారకుడిపై ల్యాండ్ అవుతుంది. ఆ తరువాత అది అక్కడి మట్టి, ఇతర పదార్థాలను సేకరించి విశ్లేషించి.. గతంలో అంగారక గ్రహంపై జీవుల మనుగడ ఉండేదా.. లేదా.. అనే విషయాలను విశ్లేషించి భూమికి ఆ వివరాలను పంపి కొంత కాలం అయ్యాక వెనక్కి వస్తుంది. అయితే ఆ రోవర్‌తోపాటు మన పేర్లు నిక్షిప్తమై ఉన్న ఓ మైక్రో చిప్‌ను కూడా నాసా అంగారకుడిపైకి పంపనుంది.

అంగారకుడి పైకి తమ పేరు చేరాలనుకునేవారు https://mars.nasa.gov/participate/send-your-name/mars2020 అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో తమ వివరాలను నమోదు చేయాలి. దీంతో ఆ పేర్లన్నింటినీ ఒక మైక్రో చిప్‌లో పొందుపరిచి మార్స్ రోవర్‌లో స్టోర్ చేస్తారు.ఆ రోవర్ అంగారకుడిపై దిగగానే ఆ చిప్‌ను అక్కడ విడిచిపెడుతుంది. అయితే ఈ పేర్ల నమోదుకు మరో 18 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు ఔత్సాహికులు తమ పేర్లను పైన చెప్పిన సైట్‌లో నమోదు చేసుకుంటే చాలు.. ఆ పేర్లు అంగారకుడిపైకి వెళ్లబోయే రోవర్ మైక్రోచిప్‌లో స్టోర్ అవుతాయి. మరింకెందుకాలస్యం.. మనం ఎలాగూ ఆ గ్రహం మీదకు వెళ్లలేం కదా. కనీసం మన పేరైనా వెళ్లిందని సంతోషించవచ్చు. వెంటనే ఆ సైట్‌లో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి మరి..!