ఆఫీసు మీటింగుల్లో అబద్ధాలు చెబుతున్నారా? ఈ కథ చదవండి.

-

ప్రఖ్యాత కంపెనీలో రామ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. టీం లీడర్ గా ఉన్న రామ్ కి ప్రతీ సోమవారం తన సహోద్యోగులతో సమావేశం ఉండేది. మొదట్లో ఆసక్తిగా అనిపించిన సమావేశాలు రాను రాను చాలా బోర్ కొట్టించడం మొదలెట్టాయి. అటు సహోద్యోగులు కూడా మీటింగ్ అనగానే చిరాకు పడుతున్నారు. అదీగాక ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా ఉంటున్నారే తప్ప తమ మనసులో మాట బయటపెట్టడం లేదు.

 

office work

ఒది గమనించిన రామ్, మన్మధుడు సినిమాలో లాగా తమ టీం మెంబర్స్ మనసులో ఏముందో కనుక్కోవాలని అనుకుని ఒక మెషిన్ తెచ్చుకున్నాడు. దాని ద్వారా వారి మనసులోని మాటలు అతనికి వినిపించసాగాయి. మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా వారి మనోభావాలు రామ్ కి తెలిసేవి. అప్పుడు, రామ్ ఇలా అనేవాడు. చర్చిస్తున్న అంశం మీద మాట్లాడుతూ, నవీన్ నువ్విలా అనుకుంటున్నావా? రాహుల్ నువ్వు చెప్పాలనుకుంటున్నది ఇదేనా? సంజయ్, ఈ సమస్యకి పరిష్కారం ఇలా చేస్తే దొరుకుతుందా అని అడిగాడూ.

దాంతో వాళ్ళు షాక్ అయ్యేవారు. మనసులో ఉన్నవాటిని కనుక్కోవడంతో అలెర్ట్ అయిన ఉద్యోగులు, రామ్ చెప్పే దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. అలా తామనుకున్న విషయాలని చెబుతూ మీటింగుని పూర్తి చేసారు. మొత్తం అయిపోయాక బయటకి వెళ్తున్న సహోద్యోగుల మనసులోని మాటలు రామ్ కి వినిపించాయి. ఇలాంటి మీటింగ్ ఇంతకు ముందెప్పుడూ అవలేదు కదా అని అనుకుంటున్నారు.

జీవితం చాలా చిన్నది. ఇంతచిన్న జీవితంలో ఒక చోట పనిచేసే కాలం ఇంకా చిన్నది. మరి అంత చిన్న సమయంలో రాజకీయాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు అనవసరం. ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు. ఇతరులకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నింటినీ మనసులో పెట్టేసుకుని గుండె బరువు పెంచేసుకుంటూ ఏదో ఒక రోజు మనిషి బరువు దించుకోవడం కంటే ఎప్పటికప్పుడు బరువు దించుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అన్నింటికన్నా ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news