మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం మాత్రం అనాది కాలం నుంచి క్రమంగా వస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే మండలాల్లో ఈ సంప్రాయం మనకు కనిపిస్తోంది. భార్యకు అధికారం ఉంటే భర్త లేదంటే తల్లికి అధికారం ఉంటే కొడుకులు పెత్తనాలు చేస్తుంటారు. ఈ తరహా రాజీకయాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మన రెండు రాష్ట్రాల్లో. కాగా ఇలాంటి సాంప్రదాయానికి జగన్ ప్రభుత్వం చెక్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి వాటివల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఇక ఇప్పటి దాకా ఇలాంటి నడిచినా కూడా వాటికి త్వరలోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబుతున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం అన్ని పార్టీల కంటే కూడా వైసీపీ నుంచే అధిక మంది స్థానిక సంస్థల్లో గెలిచారు. ఇక అప్పటి నుంచి వీరిలో మహిళలు అధికారంలో ఉన్న ఊర్లు లేదంటే మండలాల్లో వారి భర్తలు లేదంటే వారి కొడుకుల పెత్తనమే ప్రధానంగా సాగుతోంది. అధికారం వీరి చేతుల్లో ఉన్నా కూడా పెత్తనమంతా కుటుంబీకులే చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ ఇకపై ఎవరైనా భార్యల స్థానంలో భర్తలు లేదంటే కొడుకులు పెత్తనాలు చెలాయిస్తే మాత్రం క్రిమినల్ కేసుల కింద పరిగణిస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు దీనికి సంబంధించిన ఏకంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు సీఎం జగన్. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు చాలా ప్రాబ్లమ్ గా మారింది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో చాలా వరకు వైసీపీ నేతలదే అధికారం కొనసాగుతోంది. అందుకే ఈ చట్టాలు ప్రధానంగా వారికే ఇబ్బందులు తెస్తున్నాయి.